Yellow Fever Vaccination AT Bibinagar AIIMS : వివిధ దేశాలకు వెళ్లేవారికి తప్పనిసరైన ఎల్లో ఫీవర్ నివారణ టీకాను ఇచ్చేందుకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాట్లను చేస్తోంది. ఇందుకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ఇటీవల అనుమతులు ఇవ్వడంతో నెల రోజుల్లో ఇక్కడ ప్రత్యేక కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లుగా అధికారులు తెలిపారు.
ఎల్లోఫీవర్ టీకా సర్టిఫికెట్ ఉంటేనే ఆ దేశాల్లోకి ఎంట్రీ : ఎల్లో ఫీవర్ అనేది దోమల ద్వారా మానవులకు సంక్రమిస్తుంది. 42 దేశాలు ఈ టీకాను వేసుకున్నట్లు ధ్రువీకరణ పత్రం ఉంటేనే విదేశీయులను అనుమతినిస్తాయి. టీకా వేసుకోకుండా వెళ్తే క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. అందుకు ఒక్కొక్కరికి సుమారు రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. భారత్‌లో 71 కేంద్రాల్లో ఈ వ్యాక్సిన్ వేసే సదుపాయం ఉంది. హైదరాబాద్ నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో వారానికి రెండు రోజుల చొప్పున ఈ వ్యాక్సిన్ లభ్యమవుతుంది. బీబీనగర్ ఎయిమ్స్‌లో ఈ టీకాను రూ.300కు అందించనున్నారు. మొదట వారంలో ఒకరోజు (సోమవారం) చొప్పున ఈ వ్యాక్సిన్ వేసేందుకు అనుమతులు వచ్చాయి.
త్వరలోనే ఎయిమ్స్‌లో డ్రోన్ సేవలు - ఇక నిమిషాల్లోనే పరీక్షల ఫలితాలు