ETV Bharat / state

యాదాద్రికి MMTS రైలు - జూన్​లో పట్టాలెక్కనున్న పనులు - MMTS TRAIN TO YADAGIRIGUTTA

పట్టాలెక్కనున్న యాదాద్రి ఎంఎంటీఎస్​ రైలు ప్రాజెక్టు పనులు - అందుబాటులోకి వస్తే గంటలోపే యాదాద్రికి - జూన్​లో షురూ కానున్న ప్రాథమిక పనులు

YADADRI MMTS TRAIN
MMTS Train in Yadagirigutta (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 24, 2025 at 12:18 PM IST

2 Min Read

HYDERABAD TO YADADRI MMTS TRAIN : 'యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ రైలు ప్రాజెక్ట్​ కోసం నిధులు మంజూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభిస్తాం' అని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్రాజెక్టుపై ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దశాబ్దాల నుంచి యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్​ రైలు సేవలు ఆగుతూ, సాగుతూ ఊరిస్తున్న క్రమంలో కేంద్రమంత్రి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలే ఎంఎంటీఎస్​ రెండో దశ పూర్తయింది. ఇప్పటికే చర్లపల్లి టెర్మినల్​, బేగంపేట రైల్వేస్టేషన్లు ప్రారంభమయ్యాయి. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌ కింద ఘట్‌కేసర్‌ నుంచి రాయగిరి (యాదాద్రి) వరకు ఎంఎంటీఎస్‌ విస్తరణపై కేంద్రం దృష్టి సారించిన క్రమంలో ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. జూన్​లో ప్రాథమిక పనులు ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు.

ప్రాజెక్టు పనులు వెంటనే చేపట్టాలి : యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టు పనులు వెంటనే చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. ఘట్‌కేసర్‌ నుంచి యాదగిరిగుట్టకు రోజూ 50 వేల పైచిలుకు మంది రాకపోకలు సాగిస్తుంటారని, ఎంఎంటీఎస్‌ షటిల్‌ సర్వీసులు ప్రారంభించాలని, స్థల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని ప్రకటించారు.

రూ.50 కోట్లతో సర్వేలు : యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సందర్శనకు రాష్ట్ర రాజధాని (హైదరాబాద్​) నుంచి వచ్చే యాత్రికులకు త్వరితగతిన దర్శనం కల్పించేలా ఎంఎంటీఎస్​ రైలు సదుపాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాల నుంచి ప్రతిపాదనలు మాత్రమే సిద్ధం చేశాయి. గతంలో రూ.50 కోట్లతో డీపీఆర్, రైల్వే లైన్​ పనులకు సర్వేలు నిర్వహించాయి.

నిధులు మంజూరు కాకపోవడంతోనే : 2004 నుంచి ఎంత మంది ముఖ్యమంత్రులు మారినా, అప్పటి సీఎం వైఎస్​ నుంచి ఇప్పుడున్న ప్రస్తుత సీఎం రేవంత్​రెడ్డిల వరకు ప్రతిసారి ఎంఎంటీఎస్​ విస్తరణ పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ నిధులు మాత్రం మంజూరు కాకపోవడంతో పనులు పట్టాలెక్కలేదు. ప్రభుత్వం మొదట్లో సికింద్రాబాద్​ నుంచి భువనగిరి వరకు ఎంఎంటీఎస్ విస్తరిస్తామని ప్రకటించింది. క్రమంగా ఘట్‌కేసర్‌ నుంచి యాదాద్రి స్టేషన్‌ వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 2016లోనే రూ.330 కోట్ల అంచనా నిర్మాణ వ్యయంతో అప్పట్లో ఎంఎంటీఎస్​ ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ఇందులో రూ.200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, మిగిలిన నిధులు కేంద్రం భరించేలా ప్రతిపాదనలు సైతం తయారు చేసి పంపారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు కేటాయించడంలో జాప్యం నెలకొనడంతో ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది.

2023లో మరోసారి ఎంఎంటీఎస్​ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వమే చేపట్టేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.330 కోట్ల నుంచి రూ.464 కోట్లకు పెరిగింది. ఎంఎంటీఎస్‌ విస్తరణలో భాగంగానే ఘట్‌కేసర్‌-యాదాద్రి మధ్య 33 కి.మీల మేర మూడో రైల్వేలైన్‌ నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ పార్లమెంట్‌లో ఇటీవలే ప్రకటించారు.

గంటలోనే యాదాద్రికి : హైదరాబాద్​ నుంచి యాదగిరిగుట్ట 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో వెళ్లే భక్తులకు ఒక్కో టికెట్​కు గరిష్ఠంగా రూ.150 ఉంటుంది. యాదగిరిగుట్టకు చేరుకోడానికి రెండు గంటల మేర సమయం పడుతోంది. అదే ఎంఎంటీఎస్​ అందుబాటులోకి వస్తే, కేవలం రూ.20 మాత్రమే చెల్లించి, సికింద్రాబాద్​ నుంచి 45 నుంచి 1 గంట వ్యవధిలో యాదాద్రికి చేరుకునే అవకాశముంది.

IRCTC కోనసీమ టూర్ - ఒకే ట్రిప్​లో "అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం" - ధర తక్కువే!

టూర్ వెళ్తున్నారా? - ఈ ట్రైన్స్ ఒక్కసారైనా ఎక్కాల్సిందే - కొండల్లో విహరించండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.