Worker Died at Ranki Sewage Treatment Plant in AP : అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని రాంకీ కామన్ అప్లిమెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో విషవాయువులు పీల్చి ఓ కార్మికుడు చనిపోయాడు. అర్ధరాత్రి శాంపిల్స్ సేకరిస్తుండగా ల్యాబ్ టెక్నీషియన్ అప్పలనాయుడు స్పృహ కోల్పోయాడని తోటి కార్మికులు చెప్పారు. అనంతరం కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయాడని తెలిపారు. సక్రమమైన మాస్కులు లేకపోవడంతోనే అప్పలనాయుడు చనిపోయాడని CITU నేత గనిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. మృతుడి కుటుంబానికి రాంకీ యాజమాన్యం కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రకాశం జిల్లాలో దారుణం - విద్యుత్ షాక్‌కు గురై ఉద్యోగి మృతి
'మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయండి'