Woman Suicide her Lover Reject to Marry : క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు యువతీయువకుల ప్రాణాలను తీస్తున్నాయి. కనీసం ఒక్క నిమిషమైనా కన్నవారి గురించి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటూ బంగారు జీవితాలను మధ్యలోనే తుంచేసుకుంటున్నారు. ఇంట్లో అమ్మనాన్న ఏదో అన్నారని, బయటవారు తమ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారని, ప్రేమించిన ప్రేమికుడు పెళ్లికి నిరాకరించాడని, ప్రేయసి వేరే వ్యక్తితో మాట్లాడుతుందని, మార్కులు తక్కువగా వచ్చాయని, ఇలా చిన్న చిన్న కారణాలకే ఉసురు తీసుకుంటున్న ఘటనలు నిత్యం ఏదో ఒక మూలన వినిపిస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు తాజాగా ఓ యువతి ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని భవనం ఎక్కి ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారు కావడం గమనార్హం. రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,
పొట్టకూటి కోసం అసోం రాష్ట్రం నుంచి సుల్తానా బేగం అనే యువతి హైదరాబాద్‌కు వచ్చింది. ఇక్కడ సిద్ధిఖ్నగర్లోని ఓ హోటల్లో వెయిటర్‌గా పని చేస్తోంది. సిద్ధిఖ్నగర్లోనే యాజమాన్యం ఆమెకు ఇంట్లో వసతిని కల్పించింది. ఈ క్రమంలో మరో హోటల్లో వెయిటర్‌గా పని చేసే కోల్‌కతాకు చెందిన సయ్యదుల్ షేక్ అంజయ్య నగర్ బంజారా బస్తీలో నివాసం ఉంటున్నాడు. అతనితో ఆ యువతికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.
అతడి ఇంటికి వెళ్లి ఐదో అంతస్తు నుంచి జంప్ : ఇంతవరకూ అంతా బాగున్నా, ఆ యువతి పెళ్లి ప్రస్తావన తీసుకువస్తే మాత్రం నిరాకరించేవాడు. ఆమె ఫోన్ నంబర్‌ను కూడా యువకుడు బ్లాక్ చేశాడు. గురువారం తెల్లవారుజామున 4.30 గంటలకు స్నేహితుల ఫోన్‌తో ఆమె కాల్ చేసింది. తన తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారని చెప్పింది. తనను వివాహం చేసుకోవాలని కోరగా, అతడు నిరాకరించాడు. దీంతో ఆమె ఉదయం 5 గంటల సమయంలో అతడు ఉంటున్న భవనానికి వెళ్లి ఐదో అంతస్తుపైకి వెళ్లి కిందకు దూకింది. కారుపై పడటంతో అక్కడికక్కడే ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లికి నిరాకరించిన పెద్దలు - ప్రాణాలు తీసుకున్న ప్రేమజంట
ప్రేమకు పెద్దల నో - హోటల్ గదిలో ఆ ఆనంద క్షణమే వారికి చివరిదైంది