ETV Bharat / state

ఈ ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్​లో ఉంచకపోవడమే బెటర్ - పెడితే జరిగేది ఇదే! - WHICH ITEMS SHOULD NOT KEEP FRIDGE

ఫ్రిడ్జిలో కొన్నిరకాల ఆహార పదార్థాలు నిల్వ ఉంచకపోవడమే మంచిదంటున్న నిపుణులు - అలా చేయడం వల్ల అవి సహజ గుణాలు కోల్పోయే అవకాశం ఉందని వెల్లడి

What Food Items Dont Keep In Fridge
What Food Items Dont Keep In Fridge (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 11, 2025 at 8:07 PM IST

1 Min Read

What Food Items Dont Keep In Fridge : ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతుంటారు పెద్దలు. అయితే మన ఆరోగ్యం మనం తినే ఆహార పదార్థాలపైనే ఆధారపడి ఉంటుందనేది అక్షరసత్యం. సాధారంగా ఇళ్లల్లో మిగిలే ఆహార పదార్థాలతో పాటు కూరగాయలు, పండ్లు పాడవ్వకుండా ఉండేందుకు తదితర వాటిని ప్రిడ్జిల్లో ఉంచడం అందరి అలవాటు. వేసవి కావడంతో తాగునీటితో పాటు పళ్ల రసాలు, మజ్జిగ వంటి పదార్థాలను పెడుతుంటారు. బయట ఉంటే వేడికి పాడవుతాయనే ఉద్దేశంతోనే ఇలా చేస్తుంటారు.

కానీ ఫ్రిడ్జిలో అన్ని పదార్థాలను ఉంచడం మంచిది కాదు. అందులో ఉంచేటువంటి ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవడం ఉత్తమం. ఏలాంటి ఆహార పదార్థాలు ఉంచాలి? ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై పెద్దశంకరంపేట పీహెచ్‌సీ వైద్యాధికారి షర్పొద్దీన్‌ ఇలా సూచించారు.

ఏయే వస్తువులను ఫ్రిడ్జ్​లో ఉంచకూడదంటే? :

  • అన్ని వస్తువులను ఫ్రిడ్జ్​లో నిల్వ ఉంచకూడదు. అలా చేస్తే అవి సహజ గుణాలను కోల్పోతాయి
  • వెల్లుల్లి, ఉల్లిపాయలను ప్రిడ్జ్​లో ఉంచితే మొలకెత్తే అవకాశం ఉంది. ఒలిచినటువంటి వెల్లుల్లిని ఉంచడం వల్ల బూజు పట్టి ఔషధ గుణాన్ని కోల్పోతుంది.
  • కట్​చేసిన ఉల్లిపాయలను ఉంచితే అందులోని పిండి పదార్థాలు చక్కెరగా మారేటువంటి అవకాశం ఉంటుంది
  • పెరుగును ఫ్రిడ్జిలో స్టోర్​ చేస్తే మంచి బ్యాక్టీరియా కాస్త చెడుగా మారే అవకాశం ఉంది
  • వండిన రైస్​ను 24 గంటల కంటే ఎక్కువ సేపు ప్రిజ్​ను ఉంచొద్దు. అలా ఉంచిన అన్నాన్ని తింటే ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉంది.
  • బాయిలింగ్​ కోడి గుడ్లలో బ్యాక్టీరియా చేరి ఆరోగ్యానికి హాని చేసే ప్రమాదం ఉంది.
  • పలు రకాల మసాలా దినుసులతో పాటు అల్లాన్ని ప్రిడ్జిలో ఉంచితే వాటి సహజ రుచి, వాసన, మంచి గుణాలను కోల్పోతాయి
  • బాదంపప్పు, జీడిపప్పు కిస్‌మిస్‌లు వంటి డ్రైఫ్రూట్స్‌ని నిల్వ చేస్తే ఫంగస్‌ చేరి సహజ రుచిని కోల్పోయే అవకాశం ఉంది.

ఎంత తొలగించినా ఫ్రీజర్​లో ఐస్ పేరుకుపోతోందా? - ఇలా చేశారంటే ఆ సమస్యే ఉండదిక!

ఫ్రిడ్జ్​లో ఫుడ్​ ఐటమ్స్​ పెట్టేటప్పుడు ఈ తప్పులు చేయకండి! - లేదంటే త్వరగా పాడైపోతాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.