Which Clothes to Wear in Summer in Telugu : ఎండాకాలం అనగానే మన శరీరం నుంచి కారిపోతున్న చెమట, చికాకు, ఉక్కబోత, కాలు బయటపెట్టాలంటేనే ప్రజలు జంకే పరిస్థితి నెలకొంది. ఇలాంటి సందర్భాల్లో ఎండ నుంచి తట్టుకోవడానికి ఎలాంటి దుస్తులు ధరించాలో నిపుణులు సూచనలు చేస్తున్నారు.
నిపుణుల సూచనలు ఇవే : వేసవిలో శరీరానికి గాలి తగిలే దుస్తులను వాడాలి. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కాటన్ దుస్తులు ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. గాలిని ఇస్తూ శరీరాన్ని సమతుల్య స్థితిలో ఉంచుతాయి. చెమట పట్టకుండా చేస్తాయి. తద్వారా పిల్లల ఆరోగ్యం బాగుండటానికి దోహదం చేస్తుంది. వేసవి కాలంలో ప్రత్యేక ఫ్యాబ్రిక్ కాటన్ ఉపయోయోగించాలి. ఈ తరహా వస్త్రం చెమటను పీల్చుకుని శరీరానికి గాలి తగిలే విధంగా చేస్తుంది. వదులుగా, శరీరానికి పక్కాగా ఎంపిక అయ్యేలా దృష్టి పెడితే సమస్యే ఉండదు. ఈ వేసవిలో తక్కువ బరువు కలిగిన దుస్తులు వేసుకుంటే మంచిది. కాటన్‌తో పాటు లెనిన్, లాన్, రేయాన్, జెర్సీ దుస్తులు ఈ సీజన్‌లో అనువైనవని నిపుణులు చెబుతున్నారు.
శుభకార్యాలకు వెళ్లేటప్పుడు : ఏదైనా శుభకార్యాలకు వెళ్లాల్సి వస్తే చందేరి సిల్క్, మట్క సిల్క్, కశ్మీరీ సిల్క్, క్రేప్ సిల్స్ వంటివి అయితే బాగుంటుందని నిపుణులు అంటున్నారు. మహిళలు ఇంట్లో ఉండేటప్పుడు ప్రింటెడ్ కాటన్ చీరలు, హ్యాండ్‌లూమ్ చీరలకు ప్రాధాన్యత ఇస్తే మేలని సూచిస్తున్నారు. వేసవి కాలంలో రంగు దుస్తుల జోలికి వెళ్లకపోవడం మంచిది. రంగువి వేడిని గ్రహిస్తాయి. తెలుపు రంగు లేదా తేలిక పాటి రంగులు గల వస్త్రాలను ఎంపిక చేసుకుంటే మేలు.
చిన్న పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలి : చిన్నారులకు కాలానికి అనుగుణంగా దుస్తులు వేయాలి. ఫ్యాషన్ డిజైన్స్, ఎక్కువ రంగులు కలిగిన దుస్తులు వేసవి కాలంలో మంచిది కాదు. కొన్ని రకాల ఫ్యాన్సీ దుస్తులను అక్రిలిక్ పెయింటింగ్స్ వేస్తారు. ఇలాంటి దుస్తులతో కొంత మందిలో అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. నెల వయసు గల పిల్లలకు డిస్పోజబుల్ దుస్తులకు బదులుగా కాటన్‌లో దుస్తులు ధరిస్తే చాలా మంచిది. పిల్లల కాళ్లకు, చేతులకు కాటన్ గొడుగులు ధరిస్తే మంచింది.
ఎండాకాలంలో పెరుగు పుల్లగా మారుతోందా? - ఈ ఒక్కటి కలిపి 'తోడు' పెడితే అద్భుతమైన రుచి!
ఎండాకాలంలో షుగర్ పేషెంట్లు ఇబ్బందులు- ఈ టిప్స్ పాటిస్తే కంట్రోల్లో ఉంటుందట!
వేసవిలో అన్నం తినబుద్ధి కావట్లేదా? - "కొబ్బరి పెరుగు పచ్చడి"తో తింటే మెతుకు మిగల్చరు!