Student Missing in NIT Warangal : వరంగల్లోని జాతీయ సాంకేతిక సంస్థ (నిట్)లో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాజీపేట సబ్ ఇన్స్పెక్టర్ లవన్ కుమార్ కథనం ప్రకారం, హైదరాబాద్ కొత్తపేటకు చెందిన హృతిక్ సాయి (22) అనే విద్యార్థి వరంగల్ నిట్‌లో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. క్యాంపస్ హాస్టల్‌లో ఉంటున్న హృతిక్ సాయి, బుధవారం నుంచి కనిపించకుండాపోయాడు. ఈ మేరకు క్యాంపస్ సిబ్బంది, స్నేహితులు అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి : కాజీపేట శివారు ప్రాంతంలోని వడ్డేపల్లి చెరువులో గుర్తుతెలియని యువకుడి మృతదేహం ఉన్నట్లు అక్కడి స్థానికులు గురువారం (ఏప్రిల్ 10) సాయంత్రం పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు తొలుత గుర్తు తెలియని వ్యక్తిగానే పరిగణించి, మృతదేహాన్ని పంచనామా అనంతరం వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
మార్కులు తక్కువ రావడంతోనే : అనంతరం పలు సోషల్ మీడియాల్లో మృతదేహం, ఇతర వివరాలు పోస్టు చేయడంతో హృతిక్ సాయి తోటి విద్యార్థులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హృతిక్ సాయి కొంతకాలంగా కాలేజీ, హాస్టల్‌లో ముభావంగా ఉంటున్నాడని, తోటి విద్యార్థులతోనూ సరిగా మాట్లాడేవాడు కాదని, మార్కులు తక్కువగా రావడంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడినట్లు భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని ఈ మేరకు వెల్లడించారు.
చదువుకోవడం ఇష్టంలేక - తండ్రి మాటను కాదనలేక
ప్రాణం తీసిన ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ - రైలు కింద పడి యువకుడి దుర్మరణం