Visakha Prestige is fading Due to Lack of Attention to Sports: ఎందరో క్రీడాకారులను దేశానికి అందించి గొప్ప శిక్షణ ఇచ్చిన నగరం విశాఖ. ఫుట్‌బాల్, వాలీబాల్, క్రికెట్, అథ్లెట్స్ విభాగాల్లో మెరిసిన ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. కొన్నేళ్లుగా క్రీడారంగంపై కనీస దృష్టి పెట్టకపోవడం వల్ల ఆ ప్రతిష్ఠ మసకబారుతోంది. పూర్వవైభవం తీసుకురావాలని క్రీడాకారులు కోరుతున్నారు. మల్లీశ్వరి, మేరీకోమ్, పీవీ సింధు, వేణుగోపాలరావు, నితీష్ కుమార్ రెడ్డి, ఏరా జ్యోతి వంటి ప్రముఖ క్రీడాకారులు విశాఖలో గురువుల వద్ద శిక్షణ పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరిశారు.
వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఆతిథ్యం : విశాఖలో పోర్టు స్టేడియం, రైల్వే స్టేడియం, జింక్ స్టేడియం, స్టీల్ ప్లాంట్ గ్రౌండ్స్, ఆంధ్ర యూనివర్సిటీ, బీహెచ్‌పీవీ గ్రౌండ్, స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం మైదానాలు ఉన్నాయి. వాలీబాల్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన ఘనత విశాఖకు ఉంది. మహిళల బీచ్ వాలీబాల్, ఆఫ్రో - ఆసియన్ గేమ్స్ కూడా విశాఖలో జరిగాయి. అనేక డిఫెన్స్ నేషనల్ స్పోర్ట్స్ మీట్‌లకూ విశాఖ ఆతిథ్యం ఇచ్చింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల గ్రామీణ ప్రాంతాల నుంచి నైపుణ్యం ఉన్న క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పేరుతెచ్చారు.
స్టేడియాలు ప్రైవేటు పరం : విశాఖ వంటి మహానగరంలో సకల సౌకర్యాలు కలిగిన గచ్చిబౌలి లాంటి ఓ స్టేడియం ఉంటే క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మాజీ క్రీడాకారులు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో క్రీడారంగం గడ్డుపరిస్థితిని ఎదుర్కొందన్నది కొందరు క్రీడాకారుల ఆవేదన. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విశాఖకు పూర్వవైభవం తీసుకొస్తుందన్న విశ్వాసం ఒలింపిక్ క్రీడాకారుల్లోనూ వ్యక్తమవుతోంది.
క్రీడాకారులకు అధునాతన సదుపాయాలు కల్పించాల్సిందిగా కోరుతున్నారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలూ పెంచాలన్నది మరో డిమాండ్. అలాగే విశాఖలోని చాలా స్టేడియాలు ప్రైవేటు పరం కావడం వల్ల మైదానాల కొరత ఏర్పడిందని, ప్రభుత్వం చొరవ చూపి సమస్య పరిష్కరించాలని క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు.
రూ.154 కోట్లు - 26 కిలోమీటర్లు - విశాఖలో 7 మాస్టర్‌ప్లాన్ రహదారులు
ఏపీకి రండి - సన్‌రైజర్స్ జట్టుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ బంపర్ ఆఫర్