GVMC Deputy Mayor Dalli Govind Reddy: మహా విశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా 64వ డివిజన్‌కు చెందిన జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జరగాల్సిన డిప్యూటీ మేయర్ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. 56 మంది సభ్యుల కోరం అవసరం కాగా సోమవారం 54 మంది హాజరయ్యారు. ఫలితంగా డిప్యూటీ మేయర్ ఎన్నికను ఇవాళ్టికి వాయిదా వేశారు.
సోమవారం ఎన్నిక వాయిదా పడటానికి కొంత రాజకీయ పరమైన అంశం కూడా కారణమైంది. డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ సభ్యులూ ఆశించడంతో ఈ క్రమంలో కొంత సందిగ్ధం ఏర్పడింది. అయితే జనసేన అధిష్ఠానం జోక్యం చేసుకోవడంతో కూటమి ధర్మం మేరకు డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు ఇచ్చారు. దల్లి గోవింద రెడ్డి పేరును ప్రతిపాదించి షీల్డ్ కవర్‌లో పంపారు. ఇదే అంశంపై ఈ ఉదయం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు, నగర టీటీపీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లతో సమావేశం అయ్యారు.
టీడీపీ సభ్యులంతా డిప్యూటీ మేయర్ ఎన్నికకు హాజరుకావాలని, కచ్చితంగా సమావేశం జరగాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సమక్షంలో ఇవాళ నిర్వహించిన సమావేశానికి మొత్తం 59 మంది సభ్యులు హజరయ్యారు. కోరం సరిపోవడంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. దల్లి గోవింద్‌రెడ్డి మాత్రమే నామినేషన్ వేయడంతో, ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
విశాఖను అభివృద్ధి చేసి చూపుతాం: 9 నెలల సమయమే ఉన్నప్పటికీ విశాఖను అభివృద్ధి చేసి చూపుతామని డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన దల్లి గోవింద్‌రెడ్డి ప్రకటించారు. ఆశావహులు ఉన్నా డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యేందుకు సహకరించిన కూటమి నేతలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక వాయిదా: మరోవైపు తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక నిరవధికంగా వాయిదా పడింది. రెండో రోజు కోరం లేక ఛైర్మన్ ఎన్నికను ఆర్డీవో, ఎన్నికల అధికారి వాయిదా వేశారు. తదుపరి చర్యల కోసం ఈసీకి నివేదిక పంపుతామని ఎన్నికల అధికారి మాధురి తెలిపారు. నగర పంచాయతీలో మొత్తం 21 మంది సభ్యులు ఉండగా, టీడీపీ నుంచి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు 9 మంది సభ్యులు మాత్రమే ఎన్నికకు హాజరయ్యారు. 11 మంది ఉంటే కోరం సరిపోతుంది. వైఎస్సార్సీపీ సభ్యులు సమావేశానికి రాకపోవడంతో కోరంలేక ఎన్నిక వాయిదా పడింది. అటు తమకు మద్దతు ఇచ్చే వారిని వైఎస్సార్సీపీ దాచిందని టీడీపీ ఆరోపించింది.
'రూ.36 లక్షలు అవినీతి' - కడప మేయర్ సురేశ్‌పై ప్రభుత్వం కొరడా
వైఎస్సార్సీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా - బీజేపీలో చేరిన జకియా ఖానం