Vijayawada Municipal Corporation Established Shelter in City : ఉపాధి వెతుక్కుంటూ విజయవాడ వచ్చి, ఆశ్రయం లేక ఇబ్బందిపడుతున్న వారికి ప్రభుత్వం ఓ చక్కటి వసతి కల్పిస్తోంది. చాలా మందికి ఇది తెలియక ప్రైవేటు లాడ్జీలను ఆశ్రయిస్తుంటారు. జాతీయ పట్టణ జీవనోపాధుల పథకం కింద విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నగరంలో 4 చోట్ల వసతి గృహాలు ఏర్పాటు చేసింది. విద్యాధరపురం, రాణిగారితోట, గాంధీనగర్, వెహికల్ డిపో ప్రాంతాల్ల్లో వందేసి పడకల చొప్పున ఇవి అందుబాటులో ఉన్నాయి.
ఒక్క ఆధార్ కార్డు చూపిస్తే చాలు రూపాయి ఖర్చు లేకుండా అందులో ఆశ్రయం పొందొచ్చు. పడుకోవడానికి మంచం, దుప్పట్లు, మరుగుదొడ్లు, స్నానాల గదులు అందుబాటులో ఉంటాయి. ఉదయం అల్పాహారం, రాత్రి భోజనంతోపాటు టీవీ కూడా ఉంటుంది. ధ్యానం, యోగా శిక్షణ తరగతులు, అవసరమైతే వైద్య పరీక్షలూ చేయిస్తారు. అలాగని రోజుల తరబడి ఉంటామంటే కుదరదు. పని దొరికే వరకూ వాటిలో ఆశ్రయం పొందొచ్చు. ఇన్ని సౌకర్యాలు ఉన్నా వసతి గృహాల గురించి సరైన ప్రచారం లేదు. ఫలితంగా వాటికి ఆదరణే ఉండటం లేదు. ప్రభుత్వం ప్రచారం కల్పిస్తే ఎంతోమందికి ఉపయోగపడతాయి.
అభాగ్యులకు 'అమ్మానాన్న' - 'సారా' మనసు ఎంత పెద్దదో
అనాథలకు ఆపన్న హస్తం- మానవత చాటుతున్న ఫౌండేషన్స్ - Shelter For Orphan Children