Vijayawada Court Extending PSR Anjaneyulu Remand : ముంబయి నటి కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్ గడువును జూన్ 4 వరకు పొడిగిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. రిమాండ్ గడువు ముగియనుండటంతో పోలీసులు పీఎస్ఆర్ను విజయవాడ జిల్లా జైలు నుంచి విజయవాడ కోర్టుకు తీసుకువచ్చారు. అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. విచారణ జరిపిన న్యాయస్థానం పీఎస్ఆర్ రిమాండ్‌ను జూన్ 4 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ముంబయి నటి కేసులో అరెస్టైన పీఎస్ఆర్ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ముంబయికి చెందిన సినీ నటి కాదంబరీ జెత్వానీపై తప్పుడు కేసు పెట్టించి, అక్రమంగా అరెస్ట్ చేసి వేధింపులకు గురిచేసిన కేసులో ఏ2గా ఉన్న పీఎస్‌ఆర్ ఆంజనేయులను సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన్ని విజయవాడలోని జిల్లా కారాగారానికి తరలించారు. ఓ పారిశ్రామికవేత్తను అత్యాచార కేసు నుంచి బయట పడేసేందుకు అప్పటి సీఎం జగన్ హయాంలో సీఎంవో కేంద్రంగా నాటి నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్ ఆంజనేయులు, వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ తదితరులతో కలిసి ఫోర్జరీ దస్త్రం ఆధారంగా తనపై అక్రమ కేసు పెట్టి, వేధించారని కాదంబరీ జెత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
'జైల్లో బొట్టు ఇవ్వటం లేదు' - న్యాయమూర్తికి తెలిపిన పీఎస్ఆర్ ఆంజనేయులు
ఆయన ఉన్నారా? పారిపోయారా? - పీఎస్ఆర్ ఆంజనేయులు గురించి హైకోర్టు సూటి ప్రశ్న