Essential Commodities Prices Hike in Telangana : వేసవిలో ఎండలకు తోడు నగరవాసులకు ధరల సెగ తగులుతోంది. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు పెరుగుతుండగా మరోవైపు గ్యాస్ ధర, విద్యుత్ వినియోగం, నీటికి ఖర్చు పెరిగాయి. వీటితో పాటు వేసవి ప్రత్యేత ఆహార పదార్థాల నేపథ్యంలో కుటుంబాల బడ్జెట్ 25 శాతానికి పైగా పెరగడం గమనార్హం. నెలకు సామాన్యులు, మధ్యతరగతి వారు కనీసం నాలుగు వేల నుంచి రూ.5వేల వరకు అదనంగా ఖర్చు చేస్తున్నారని నిపుణులు పేర్కొన్నారు.
మార్కెట్లో చుక్కలు చూపిస్తున్న ధరలు : నిత్యావసర సరుకుల ధరలు 10శాతం నుంచి 20వరకు పెరిగాయి. పప్పుల ధర హోల్‌సేల్ మార్కెట్‌లోనే రూ.110 నుంచి రూ.140 వరకు ఉండగా రిటైల్ మార్కెట్‌లో ఇంతకంటే ఎక్కువగా ఉన్నాయి. రిటైల్ మార్కెట్‌లో ఏ రకం కూరగాయలైనా సగటున రూ.40 ఉండగా, పచ్చిమిర్చి, చిక్కుడు వంటివి రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతున్నాయి.
"జనవరి, ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో ఖర్చులు బాగా పెరిగాయి. అపార్ట్‌మెంట్లో మెయింటెనెన్స్ కాకుండా నీటికి రూ.1000 అదనంగా ఇవ్వాల్సి వస్తోంది. మా ఇంట్లో ఫ్యాన్‌లే ఉన్నాయి, అయినా సరే కరెంట్ బిల్లు ఫిబ్రవరి కంటే రూ.375 ఎక్కువగా వచ్చింది. సరుకులు, కూరగాయలపై కూడా రూ.1500 వరకు ఎక్కువైంది. గ్యాస్‌కూడా రూ.50 పెరిగింది. జూన్, జులై వరకు ఇవి తప్పేలాలేవు." - లక్ష్మి, గృహిణి, కూకట్‌పల్లి
పెరిగిన బిల్లులు : మార్చి మొదటివారం నుంచే ఎండలు మండుతున్నాయి. ఫ్యాన్‌లు, ఏసీల వినియోగం భారీగా పెరిగింది. ఏప్రిల్ మొదటివారంలో ఫ్యాన్లు వాడే వారి ఇళ్లల్లో 30శాతం నుంచి 40శాతం బిల్లులు పెరగ్గా ఏసీలున్న నివాసాల్లో దాదాపు రెట్టింపు కావడం గమనార్హం.
తాగునీటికి అదనంగా : అపార్ట్‌మెంట్‌లలో నెలకు నీటి కోసమే ఒక్కో కుటుంబం రూ.1000 నుంచి రూ.1500 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. సగటున 15 ఫ్లాట్‌లు ఉంటే రోజుకు రెండు ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారు. ఇందుకు సగటున నెలకు రూ.45వేలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
వంట గ్యాస్ ధరల పెంపు- ఎంత పెరిగిందంటే?
వామ్మో ఇవేం ధరలు బాబోయ్!! - ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు - VEGETABLES PRICE HIKE IN TELANGANA
Vegetables Price Hike in Telangana : కూరగాయలు ధరలు తగ్గాలంటే.. ఇలా చేయాల్సిందే!