Various Types of Food Items at Masula Beach Festival : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మసులా బీచ్ ఫెస్టివల్-2025లో వివిధ రకాల వంటకాలు అందరికీ నోరూరించేలా ఉన్నాయి. మాడుగల హల్వా, బందరు లడ్డూ, ఆత్రేయపురం పూతరేకులు, రాయలసీమ రుచులు ఇలా ఇతర ప్రాంతాల్లో ప్రత్యేకత సంతరించుకున్న వంటకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. సందర్శకులు ఆయా దుకాణాలను తిలకించడంతో పాటు రుచి చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వంటకాలతో పాటు బందరు రోల్డ్‌గోల్డ్ నగలు, చేనేత వస్త్రాలు ఇలా వివిధ విభాగాల వారీగా దుకాణాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం అయ్యే కొద్దీ ఆయా దుకాణాల వద్ద సందర్శకులతో సందడి వాతావరణం నెలకొంది.

బందరు లడ్డు ప్రత్యేకత : బందరు లడ్డూకు ఉన్న చారిత్రక నేపథ్యం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. దిల్లీ సుల్తానుల కాలంలో బుందేల్‌ఖండ్ నుంచి వలస వచ్చిన బొందిలీలు ఈ బందరు తొక్కుడు లడ్డూ తయారు చేసినట్లు చర్రిత చెబుతోంది. శనగపిండి, నెయ్యి కలిపి బూందీ చేసి, వాటిని రోకలితో దంచి బెల్లంపాకంలో పోసి తయారు చేసే బందరు లడ్డూకు స్వాంతంత్య్రం రాకపూర్వం నుంచే ఎంతో ఖ్యాతి వహించింది. దీంతో ఇప్పటికీ మచిలీపట్నం నుంచి ఇతర దేశాలకు సైతం ఎగుమతి అవుతోంది. బీచ్ ఫెస్టివల్‌లో ఏర్పాటు చేసిన ఫుడ్‌కోర్టులో బందరు లడ్డూ ప్రత్యేకత సంతరించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు బందరు లడ్డూ కదా అని అడిగి మరీ ఇంటికి తీసుకెళ్తున్నారు.
ఘనంగా మసులా బీచ్ ఫెస్టివల్ - పోటీలను తిలకిస్తున్న పర్యటకులు
ఘనంగా 'మసులా బీచ్ ఫెస్ట్-2025' ప్రారంభం - భారీగా వచ్చిన పర్యాటకులు