Vallabhaneni Vamsi Remand Extended : వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయనకు న్యాయస్థానం మరోసారి రిమాండ్ పొడిగించింది. వంశీ కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో పోలీసులు విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు ఈనెల 22 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుతో పాటు టీడీపీ కార్యాలయంపై దాడి కేసుల్లో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు ఈకేసులో అరెస్టైన మరో నలుగురు నిందితులకు కూడా కోర్టు రిమాండ్ గడువును పెంచింది.
మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితుడు రంగాపై పటమట పోలీసులు పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ కోర్టు పీటీ వారెంట్ పిటిషన్‌ను అనుమతించింది. పోలీసులు ఆయణ్ని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం ఈనెల 22 వరకు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు రంగాను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఏమో! తెలియదు - కస్టడీలో వల్లభనేని వంశీ సమాధానాలు
వల్లభనేని వంశీకి మరో షాక్ - బెయిల్ పిటిషన్ కొట్టివేసిన సీఐడీ కోర్టు