New Electrical Buses in Hyderabad : ప్రధాన మంత్రి ఈ-డ్రైవ్ పథకం కింద హైదరాబాద్‌కు 2000 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి కుమారస్వామి తెలిపారు. రాష్ట్రాలకు ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపుపై కుమారస్వామి గురువారం ఓ ప్రకటన చేశారు. పీఎం ఈ-డ్రైవ్ కింద 11వేల ఈ - బస్సులు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
సుమారు 11వేల ఈ-బస్సులను 5 నగరాలకు కేటాయిస్తామన్నారు. వీటిలో బెంగళూరుకు 4,500, దిల్లీకి 2,800, అహ్మదాబాద్‌కు 1000, సూరత్‌కు 600 బస్సులు కేటాయిస్తామని పేర్కొన్నారు. మొత్తం 14,028 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. పీఎం ఈ-డ్రైవ్ కింద ఎలక్ట్రిక్ బస్సుల కోసం కేంద్రం రూ.10,900 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.