Union Minister Bandi Sanjay Tribute To Ramoji Rao : రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపక ఛైర్మన్, పద్మవిభూషణ్ రామోజీరావులోని క్రమశిక్షణ, నిజాయితీ, పట్టుదల ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. చంద్రయాన్ సందర్భంగా వారితో మాట్లాడిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. రామోజీరావు వర్ధంతి సందర్భంగా సిరిసిల్లలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
🔸రామోజీరావు మాకు స్పూర్తిదాయకం
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 8, 2025
🔸క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీకు నిలువెత్తు రూపం
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, పద్మవిభూషణ్ రామోజీరావు గారు అన్ని తరాలకు ఆదర్శప్రాయుడు. క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీ.. ఆయన అవలంబించిన విధానాలు. పలుమార్లు ఆయనతో ముచ్చటించి కొన్ని జీవన విలువల్ని… pic.twitter.com/p5AnH29UyW
‘‘చంద్రయాన్‌ను విజయవంతంగా ప్రయోగించిన రోజు రామోజీరావుతో రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు 3 గంటలపాటు ఆయనతో గడిపిన క్షణాలు ఇంకా నా కళ్ల ముందే మెదులుతున్నాయి. ఆయనను కలిసిన ప్రతిసారి జరిగే చర్చలు ఎంతో ఆసక్తిగా ఉండేవి. ఆయనలోని నిజాయితీ, క్రమశిక్షణ, దూరదృష్టి, అనుకున్నది సాధించే వరకు పట్టుదలతో వ్యవహరించే తీరు నాకెప్పటికీ స్ఫూర్తిదాయకం. రామోజీరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పిస్తున్నాను. రామోజీ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన ఆశయాల సాధనలో ‘ఈనాడు’ గ్రూప్ సంస్థలు మరింత ముందుండాలని కోరుకుంటున్నాను. రామోజీ మన మధ్య లేకపోయినా ఆయన స్మృతులు, ఆశయాలు సజీవంగా ఉన్నాయి.’’ - బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
స్ఫూర్తి 'మూర్తి'- రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు విగ్రహావిష్కరణ
'అమరం, అపూర్వం మీ చరిత - ఆ వెలుగులో మునుముందుకు సాగడమే మా భవిత'