ETV Bharat / state

నిరుద్యోగులకు గుడ్​న్యూస్ - హైడ్రాలో డ్రైవర్ పోస్టులు - వారికి మాత్రమే - DRIVER POSTS IN HYDRA

హైడ్రాలో డ్రైవర్ పోస్టుల కోసం 200 ఖాళీలతో ప్రకటన - భారీగా తరలివచ్చిన అభ్యర్థులు - పోలీసు కానిస్టేబుల్​ మెయిన్స్ పరీక్షలో కొద్దిలోనే ఉద్యోగం కోల్పోయిన వారికి మత్రమే అవకాశమని వెల్లడి

DRIVER POSTS IN HYDRA
DRIVER POSTS IN HYDRA (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 19, 2025 at 8:31 PM IST

1 Min Read

Driver Posts In Hydra : హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)లో డ్రైవర్లుగా చేరేందుకు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో యువత హైదరాబాద్​లోని హైడ్రా ఆఫీసుకు తరలివచ్చింది. ఔట్ సోర్సింగ్ విధానంలో 200 డ్రైవర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవల హైడ్రా పత్రికా ప్రకటనను జారీ చేసింది.

వారికి మాత్రమే అర్హత : 19వ తేదీ నుంచి రెండు రోజులపాటు దరఖాస్తులు స్వీకరిస్తామని హైడ్రా అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే 2022-23 ఏడాదికి పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల్లో స్వల్ప మార్కులతో ఉద్యోగం కోల్పోయిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని వెల్లడించింది.

"నేను మిర్యాలగూడ నుంచి వచ్చాను. హైడ్రాలో ఉద్యోగ ప్రకటన చూసి హైదరాబాద్​కు ఉదయమే చేరుకున్నాను. మా స్నేహితులు హైడ్రాలోనే ఇప్పటికే జాబ్​ చేస్తున్నారు. వారు బాగానే ఉందని చెబుతున్నారు. ఉద్యోగం వస్తే చక్కగా చేసుకుంటా" - నిరుద్యోగ అభ్యర్థి

200 మందిని డీఆర్​ఎఫ్​లోకి : దీంతో వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో యువత హైడ్రా సూచించిన కార్యాలయానికి చేరుకొని దరఖాస్తులు సమర్పించారు. రాష్ట్ర పోలీసు రిక్రూట్ మెంట్ తుది ఫలితాల నివేదిక ఆధారంగా అందులో పేర్లు మ్యాచ్​ అయిన వారి దరఖాస్తులను మాత్రమే హైడ్రా సిబ్బంది స్వీకరించారు. ఇప్పటికే 200 మంది అభ్యర్థులను డీఆర్ఎఫ్ (జిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్)లోకి తీసుకున్న హైడ్రా మరో 200 మందిని తీసుకునేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన వీడియోను ఈటీవీ భారత్ చిత్రీకరించింది.

మియాపూర్​లో కదిలిన హైడ్రా బుల్డోజర్లు - హెచ్​ఎండీఏ లేఅవుట్​లో అక్రమ నిర్మాణాల ధ్వంసం

కోహెడ కబ్జా స్థలాన్ని సందర్శించిన హైడ్రా కమిషనర్ - అక్రమదారులపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.