Two Girls Died Diving into Water Tank in AP : కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈత కొట్టడానికి నీటిలోకి దిగిన ఇద్దరు బాలికలు మృతి చెందారు. గోనెగండ్ల గ్రామంలో తల్లిదండ్రులతో కలిసి మంజుల(13), మధుప్రియ(14) అనే బాలికలు కూలీ పనులకు వెళ్లారు. పొలం నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఈత కొట్టేందుకు అక్కడే ఉన్న నీటి ట్యాంక్ దగ్గరకు ఇద్దరు బాలికలు వెళ్లారు.
తక్కువ నీరు ఉంటుందని భావించిన బాలికలు ట్యాంక్ లోపలికి దిగారు. అయితే నీటి ట్యాంక్ లోతు ఉండటంతో బాలికలు ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. ఈత కొట్టి వస్తారన్న బాలికలు నీట మునిగి ప్రాణాలు కోల్పోవడంతో బాలికల తల్లిడంద్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బాలికల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కాలువలోకి దిగిన మనవళ్లు - రక్షించబోయిన నానమ్మ - ముగ్గురూ మృతి
పెళ్లింట విషాదం - కాళ్ల పారాణి ఆరకముందే కాటికి - నవ వరుడిని కబళించిన మృత్యువు!