ETV Bharat / state

YUVA : పేదింటి విద్యాకుసుమం- ట్యూషన్లు చెబుతూనే 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి - YUVA STORY

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 10, 2024, 4:22 PM IST

Updated : Aug 10, 2024, 6:41 PM IST

Tualsi got Four Govt Jobs : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వం ఉద్యోగం సాధించడం అంత తేలికకాదు. తల్లిదండ్రుల కష్టాన్ని కళ్లారా చూసిన ఆ యువతి, ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, సరైన వసతులు లేకపోయినా వెనకడుగు వేయలేదు. పుస్తకాల పురుగులా ఆహర్నిశలు కష్టపడి చదివి ఏడాది వ్యవధిలోనే 4 ఉద్యోగాలు సాధించి శభాస్‌ అనిపించింది. మరి, ఆ సరస్వతి పుత్రిక సక్సెస్‌ స్టోరీ మనమూ చూద్దామా.

Tualsi success story
Tualsi got Four Govt Jobs (ETV Bharat)

Tualsi success story : శక్తికి మించి చదివించిన తల్లిదండ్రుల కష్టాలను కళ్లారా చూసిందీ విద్యా కుసుమం. అందుకోసం ఆహర్నిశలు చదివింది. ప్రాథమిక విద్యాభ్యాసం మొదలుకొని ఎమ్‌టెక్‌(M.Tech) దాకా మంచి మార్కులు తెచ్చుకుని ఉచితంగా చదువుకుంది. ఆర్థిక ఇబ్బందుల నడుమ ట్యాషన్లు చెబుతూ వచ్చిన డబ్బులతో పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది. పట్టుదలతో చదివి 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి, తల్లిదండ్రుల కలలను నిజం చేసింది.

నల్గొండకు వలస : పుస్తకాలతో కుస్తీ పడుతున్న ఈ యువతి పేరు చింతల తులసి. నల్గొండ జిల్లా కల్మెర గ్రామానికి చెందిన వెంకన్న, లక్ష్మి దంపతుల చిన్న కుమార్తె. గ్రామంలోని ఎకర పొలంలో పంటలు సరిగ్గా పండకపోవడంతో, వెంకన్న తన కుంటుబాన్ని తీసుకుని నల్గొండ పట్టాణానికి వలసొచ్చారు. అక్కడే లాండ్రీషాపు నడుపుతూ వచ్చిన డబ్బుతోనే పిల్లలను చదివించారు. బాల్యం నుంచి తల్లిదండ్రుల పడే కష్టాలను చూసిన తులసి ఎలాగైనా అందులోంచి వారిని బయటపడేయాలని భావించింది.

పోటీ పరీక్షలకు సన్నద్ధం : అందుకు చదువొక్కటే మార్గమని అనుకుంది. రేయింబవళ్లు శ్రమించి పదో తరగతిలో 9.8 జీపీఏ తెచ్చుకుని భవిష్యత్తుకు పునాది బాటలు వేసుకుంది. ఇంటర్‌లోనూ మంచి మార్కులు సాధించిన తులసి, జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో ఉచితంగా బీటెక్‌ (B.tech) చదివింది. అనంతరం గేట్‌ ప్రవేశపరీక్ష రాయగా విజయవాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో సీటొచ్చింది. కానీ, డబ్బులు లేక అందులో చేరలేదు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీలో ఎమ్‌టెక్‌ (M.tech) పూర్తిచేసింది. ఆ సమయంలోనే పోటీ పరీక్షలకు సన్నద్ధమవ్వడం ప్రారంభించింది.

ఎమ్‌టెక్‌ చదివేటప్పుడు వచ్చిన ఉపకార వేతనంతో పాటు ట్యూషన్లు చెప్పగా వచ్చిన డబ్బులతోనే పరీక్ష ఫీజులను చెల్లించినట్లు తులసి చెబుతోంది. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా 2 సంవత్సరాలు కష్టపడి చదివినట్లు వివరిస్తోంది. ఇటీవల విడుదలైన గ్రూప్‌- 4 సహా పాలిటెక్నిక్‌ లెక్చరర్‌, ఏఈఈ, ఏఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లు చెబుతోందీ సరస్వతీ పుత్రిక.

"ఇటీవల విడుదలైన గ్రూప్‌- 4 సహా పాలిటెక్నిక్‌ లెక్చరర్‌, ఏఈఈ, ఏఈ ఉద్యోగాలకు ఎంపికయ్యాను. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా 2 సంవత్సరాలు కష్టపడి చదివాను. పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేవాళ్లు ఒకటి రెండు సార్లు విఫలమైనా నిరాశ చెందకుండా చదివితే ప్రభుత్వ ఉద్యోగం కచ్చితంగా వస్తుంది". - చింతల తులసి, 4 ఉద్యోగాలు సాధించిన యువతి

నిరాశ చెందకుండా ప్రయత్నం : ప్రభుత్వ ఉద్యోగమే పరమావధిగా ప్రీపరేషన్‌ మొదలుపెట్టినట్లు చెబుతోంది తులసి. రోజంతా లైబ్రరీలోనే ఉండి చదువుకున్నట్లు వివరిస్తోంది. యూట్యూబ్‌లో తరగతులు విని మెటిరీయల్‌ తయారు చేసుకున్నానని అంటోంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేవాళ్లు ఒకటి రెండు సార్లు విఫలమైనా నిరాశ చెందకుండా చదివితే ప్రభుత్వ ఉద్యోగం కచ్చితంగా వస్తోందని చెబుతోంది.

కుమార్తెకు ఏడాది వ్యవధిలోనే 4 ప్రభుత్వ ఉద్యోగాలు రావడం పట్ల తల్లిదండ్రుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్ల తమ కష్టానికి ఫలితం దక్కిందని చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టాలు చూసి పెరిగినందువల్లే ప్రభుత్వ ఉద్యోగం సాధించగలిగానని తులసి అంటోంది. కృషి, పట్టుదల ఉంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం సులువే అని సూచిస్తోంది. భవిష్యత్తులో గ్రూప్‌-1 ఉద్యోగం సాధించడమే లక్ష్యమని చెబుతోంది తులసి.

ఇన్నాళ్లకు కల నెరవేరింది - కుటుంబ ఆలనా - పాలనా చూస్తూనే 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గృహిణి - Women Gets 5 Government Jobs

నిరుపేద కుటుంబంలో పుట్టిన యువతి - 3 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కైసవం - Chandrakala Gets 3 Central Jobs

Last Updated : Aug 10, 2024, 6:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.