TTD Ready to Take Action on Bhumana Karunakar Reddy: వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ చర్యలకు సిద్ధమైంది. తిరుమలలోని ఎస్వీ గోశాలలో గోవుల మృతిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయనపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎస్వీ గోశాలలో 100 గోవులు మరణించాయని పవిత్రమైన గోశాలను గోవధ శాలగా మార్చారంటూ కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేసిన ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.
శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా భూమన మాట్లాడారని భారతీయ న్యాయ సంహిత 356, ఐటీ యాక్ట్ 74 ప్రకారం కేసు నమోదు చేయాలని కోరారు. దాణా పేరుతో కోట్ల రూపాయలు కుంభకోణానికి పాల్పడ్డారని, కాలం చెల్లిన మందులను వినియోగించి గోవుల మృతికి కరుణాకర రెడ్డి కారణమయ్యారని ఆరోపించారు. గోవు, గోవిందుడితో ఆటలాడవద్దని భూమనకు భాను ప్రకాష్ రెడ్డి హితవు పలికారు.
పురుగులు పట్టిన ఆహారాన్ని గోవులకు పెట్టారు: భూమన కరుణాకర్ రెడ్డి తీరు భక్తుల మనోభావాలు దెబ్బతిసేలా ఉందని అలాగే ఎస్వీ గోశాలపై అసత్య ప్రచారం చేశారని భాను ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా బయట పెట్టామని వివరించారు. కరుణాకర్ రెడ్డి మాత్రం నోరు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఛైర్మన్‌గా ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో గోవులు చనిపోయాయని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పురుగులు పట్టిన ఆహారాన్ని గోవులకు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే టీటీడీలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని భాను ప్రకాష్ పేర్కొన్నారు.
ఎస్వీ గోశాలపై కరుణాకర్‌రెడ్డి అసత్య ప్రచారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా భూమన వ్యవహరించారు. వైఎస్సార్సీపీ హయాంలో అక్రమాలపై ఆధారాలతో బయటపెట్టాం. కరుణాకర్‌రెడ్డి మాత్రం అసత్యాన్ని ప్రచారం చేశారు. నిరాధార ఆరోపణలు చేసిన భూమనపై కేసు నమోదు చేయాలని కోరడం జరిగింది. భూమన టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు పెద్దసంఖ్యలో గోవులు చనిపోయాయి. వైఎస్సార్సీపీ హయాంలో పురుగులు పట్టిన ఆహారాన్ని గోవులకు పెట్టారు.- భాను ప్రకాష్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు
గత ఐదేళ్లలో ఎన్నో అవకతవకలు - చనిపోయిన ఆవుల వివరాలు దాచిపెట్టారు: టీటీడీ ఈవో
టీటీడీని రాజకీయాల్లోకి లాగొద్దు - గోవు, గోవిందుడితో భూమన ఆటలా?