Traffic Restrictions in Hyderabad : హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని గౌలిగూడలో ఉదయం 11:30 గంటలకు వీరహనుమాన్ విజయయాత్ర ప్రారంభం కానుంది. గౌలిగూడ రామమందిరం నుంచి సికింద్రాబాద్ తాడ్‌బండ్ వరకు ఈ విజయయాత్ర సాగనుంది. రాత్రి 8 గంటల వరకు వీరహనుమాన్ విజయయాత్ర కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
17 వేల మంది పోలీసులతో బందోబస్తు : దాదాపు 12 కిలో మీటర్లకు పైగా వీరహనుమాన్ విజయయాత్ర కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హనుమాన్ యాత్ర కోసం 17 వేల మంది పోలీసులు భారీ బందోబస్తు కల్పిస్తున్నారు. హనుమాన్ యాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో హనుమాన్ యాత్ర, ఐపీఎల్ మ్యాచ్ల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలతో పలు మార్గాల్లో దారి మళ్లించనున్నారు.
హనుమంతుడికి "గుమ్మడి పూరీలు" - స్వామి జయంతికి అద్భుత ప్రసాదం! - అనాస పాయసం కూడా
24 గంటల పాటు అఖండ హనుమాన్ చాలీసా పఠనం - పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు