TTD Chairman BR Naidu On Board Resolutions : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శాశ్వత ఉద్యోగులకు 3 నెలలకు ఒకసారి సుపథం దర్శనం కల్పిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. సుపథం టికెట్ ఇచ్చి శ్రీవారి దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. ఇప్పటివరకు సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులకు ఆన్లైన్ కేటాయిస్తున్న దర్శన టికెట్లు కేటాయింపును ఆఫ్‌లైన్ లోనూ అందించాలని టీటీడీ బోర్డ్ నిర్ణయించింది. వీటితో పాటు తిరుమలలో లైసెన్స్ లేని దుకాణాలను ఖాళీ చేయిస్తామని బోర్డు సభ్యులు వివరించారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఈవో శ్యామలరావుతో కలిసి బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. టీటీడీ బోర్డు తీర్మానాలను వివరించారు.
బోర్డు చేసిన తీర్మానాలు ఇవీ :
- విదేశాల్లో ఆలయాల నిర్మాణాల కోసం ప్రత్యేక ట్రస్ట్
- టీటీడీ ఆస్తులు పరిరక్షించేందుకు కమిటీ ఏర్పాటు
- టీటీడీకు చెందిన భూముల న్యాయపరమైన వివాదాలపై పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు
- టీటీడీలో విధులు నిర్వహిస్తున్న హిందూయేతర ఉద్యోగుల తొలగింపుపై తీర్మానం
- వచ్చే ఏడాది కాలంలో వివిధ రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేక చర్యలు
- గ్రామాల్లో అర్ధాంతరంగా ఆగిన ఆలయాల నిర్మాణాలకు ఆర్థిక సాయం అందించడం
- శ్రీనివాస సేవా సమితి పేరుతో శ్రీవారికి వారికి కైంకర్యాల సామగ్రి సరఫరాలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
- టీటీడీ మూలాలున్న వివిధ ప్రాంతాల్లోని ఆలయాల పునరుద్ధరణకు తీర్మానం
- తిరుమలలో అనధికార హాకర్లు తొలగింపునకు విజిలెన్స్, రెవెన్యూ అధికారులతో కూడిన కమిటీ
- సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులకు ఆఫ్‌లైన్‌లో దర్శన టికెట్లు కేటాయింపు. ప్రయోగాత్మకంగా పూర్వ విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయం
- రూ.5,258.68 కోట్లతో టీటీడీ 2025-26 బడ్జెట్‌కు ఆమోదం
- రూ.772 కోట్లతో గదుల ఆధునికీకరణకు బోర్డు నిర్ణయం
"రూ.5258.68 కోట్లతో 2025-26 బడ్జెట్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. శ్రీవారి పవిత్రమైన భూమి ఒక అంగులం కూడా అన్యాక్రాంతం కాకూడదని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని రాష్ట్ర రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించాలని టీటీడీ ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాయడం జరిగింది. దీనిపై కొంత మంది స్పందించారు. మరికొంత మంది స్పందించాల్సి ఉంది. టీటీడీలో శాశ్వత ఉద్యోగులకు మూడు నెలలకు ఒక సారి సుపథం టికెట్లు ఇచ్చి దర్శనం కల్పించాలని నిర్ణయించడం జరిగింది"- బీఆర్ నాయుడు, టీటీడీ ఛైర్మన్
తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక - 25, 30 తేదీల్లో ఆ దర్శనాలు రద్దు
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జూన్ కోటా విడుదల - ఈ నెల 24న రూ.300 కోటా టికెట్లు