Tirumala Salakatla Vasanthotsavam 2025 : తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం నుంచి ఈనెల 12 వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆ 3 రోజులు కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, 10న తిరుప్పావడను టీటీడీ రద్దు చేసింది.
మరోవైపు తిరుమల శ్రీవారిని ఇవాళ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ సమయంలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ సిబ్బంది మంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వదించి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీనావాసుడి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు కొల్లు చెప్పారు.
Salakatla Vasanthotsavam : మరోవైపు తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం నాడు శ్రీనివాసుడిని 65,201 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,040 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారికి రూ.3.93 కోట్ల ఆదాయం వచ్చింది.
తిరుమల దర్శనం - ప్రజాప్రతినిధులకు తెలంగాణ సర్కార్ ప్రత్యేక పోర్టల్