Three youth die after falling into Krishna River: కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శ్రీరామనవమి సందర్భంగా కృష్ణా నదిలో స్నానానికి దిగి ముగ్గురు బాలురు మృతి చెందారు. అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామానికి మత్తి వెంకట గోపి కిరణ్(15), ఎం. వీరబాబు(15), ఎం. వర్ధన్(16) స్నానానికి నదిలోకి దిగి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
డీఎస్పీ విద్యశ్రీ ఆధ్వర్యంలో సీఐ యువ కుమార్, ఎస్‌ఐ శ్రీనివాసులు గజ ఈతగాళ్లను రప్పించి వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటికి ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముగ్గురు యువకుల మృతితో మోదుమూడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సంఘటన స్థలానికి వెళ్లి తల్లితండ్రులను ఓదార్చారు.
నీళ్లలో కొట్టుకుపోయిన పిల్లలు - రక్షించేందుకు దిగిన తండ్రి సైతం
దారుణం - ఇద్దరు పిల్లల్ని కాలువలోకి తోసేసిన తండ్రి - పాప మృతి