ETV Bharat / state

తిరుమలలో భద్రతా వైఫల్యం - శ్రీవారి మహాద్వారం వద్దకు చెప్పులతో భక్తులు - DEVOTEES VISITED WITH SLIPPERS

ఆలయ మహాద్వారం వద్ద ముగ్గురు భక్తులను అడ్డుకున్న విజిలెన్స్ సిబ్బంది - వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్ద భక్తులను గుర్తించకుండా పంపిన తనిఖీ సిబ్బంది

Devotees Visited With Slippers in Tirumala
Devotees Visited With Slippers in Tirumala (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 12, 2025 at 4:43 PM IST

Updated : April 12, 2025 at 4:57 PM IST

1 Min Read

Devotees Visited With Slippers in Tirumala : తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు పాదరక్షలతో భక్తులు చేరుకున్నారు. ఆ ముగ్గురుని విజిలెన్స్‌ అధికారులు అడ్డుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్ద భక్తులను గుర్తించకుండా తనిఖీ సిబ్బంది పంపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రంలో ఇటివలే భద్రత వైఫల్యం కనిపించింది. తిరుమలకు చేరుకున్న అన్యమత వ్యాఖ్యలతో కూడిన ఓ కారు కనిపించింది. సాధారణంగా అలిపిరి తనిఖీ కేంద్రంలో రాజకీయ పార్టీల చిహ్నాలు, అన్యమత చిహ్నాలు, ఫొటోలు అనుమతించరు. అయితే కారుపై అన్యమత వ్యాఖ్యలు ఉన్నాయి. అది తిరుమలకు చేరుకోవడంపై టీటీడీ తనిఖీ భద్రతా వైఫల్యాన్ని సూచిస్తుంది.

అలాగే కొద్దిరోజుల కిందట అలిపిరి గేటు వద్ద తనిఖీలను తప్పించుకుని ఓ అన్యమత వ్యక్తి బైకుతో ఘాటు రోడ్డులో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. విచారించిన సిబ్బంది అతని మానసిక పరిస్థితి సక్రమంగా లేదని తేల్చారు. ఇకనైనా తనిఖీ కేంద్రం సిబ్బంది పటిష్ట తనిఖీలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

టీటీడీ కీలక నిర్ణయం - భక్తుల కోసం అలిపిరిలో బేస్‌ క్యాంప్‌!

వేసవిలో శ్రీవారి సామాన్య భక్తులకు ప్రాధాన్యత - వారి సిఫారసు లేఖలు రద్దు

Last Updated : April 12, 2025 at 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.