Thorny Frogs Caught in Fishermens Nets On Rushikonda Coast : కప్పలు ఎలా ఉంటాయో మీకు తెలుసా? ఎప్పుడైనా చూశారా? అయ్యో ఇదేం ప్రశ్న. కప్పలు తెలియకపోవటం ఏంటి? మన చుట్టుపక్కల ఎన్నిసార్లు చూడలేదు అనుకుంటున్నారు కదూ. అయితే ముళ్లు ఉండే కప్పల గురించి ఎప్పుడైనా విన్నారా? వాటిని ఎప్పుడైనా చూశారా? అవునండీ మీరు వింటున్నది నిజమే కొన్ని కప్పకు ఒళ్లంతా ముళ్లుండి చూపరులను ఆకట్టుకున్నాయి.
సముద్రంలో వివిధ రకాల కప్ప జాతులుంటాయి. వాటిల్లో ముళ్లు కలిగిన కప్పలు కూడా ఉన్నాయి. విశాఖ నగరం రుషికొండ తీరంలో సోమవారం మత్స్యకారుల వలకు ఇలాంటి ముళ్ల కప్పలు చిక్కాయి. ఏవైనా పెద్ద జీవులు వాటిపై దాడికి యత్నిస్తే వెంటనే ఈ కప్పలు తమ శరీరంపై ఉన్న ముళ్లతో ప్రతిఘటించి తమను తాము రక్షించుకుంటాయని జాలర్లు చెబుతున్నారు. ఈ కప్పల ముళ్లు గుచ్చుకుంటే మాత్రం తీవ్ర నొప్పితో బాధపడాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. అయితే వలలకు చిక్కిన ఈ జీవుల్ని మత్స్యకారులు తిరిగి సాగర జలాల్లో విడిచిపెట్టారు.

ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న కప్ప
కప్ప శరీరంపై పుట్టగొడుగు ప్రత్యక్షం- సైన్స్ వండర్ అంటున్న శాస్త్రవేత్తలు!