Hyderabad Crime News : నగరంలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా, సీసీటీవీ కెమెరాలకు సైతం చిక్కకుండా తిరుగుతున్నారు. దీంతో వారిని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారుతోంది. వారు వేసే ప్లాన్లకు ఒక దశలో ఇలా కూడా దొంగతనం చేయవచ్చా అన్నట్లు పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. దొరికిన కాడికి దోచుకుంటూ, ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తూ ఇటు బాధితుడికి, అటు పోలీసులకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతున్నారు. ఉదాహరణకు చెప్పుకుంటే,
- తాజాగా జూబ్లీహిల్స్‌లోని ఎంపీ అరుణ నివాసంలో ఒక దొంగ ప్రవేశించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ దొంగ గంటన్నర పాటు అక్కడే తిరిగి సొత్తు ఏమీ దొరక్క వెళ్లిపోయాడు. ఇంట్లోకి ప్రవేశించే సమయంలో మాస్క్, గ్లౌజ్‌లు ధరించాడు. కానీ బయటకొచ్చినప్పుడు మాత్రం టక్ చేసుకొని, మాస్క్ తొలగించి, కొంత దూరం ఆటోలో ప్రయాణించి తిరిగి వెనక్కి వచ్చి పోలీసులను ఏమార్చాడు. చివరకు పోలీసులు 300 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను విశ్లేషించి, ఆ దొంగను పట్టుకుని అరెస్ట్ చేశారు.
- మరోవైపు సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న మరొక దొంగ రెండు జతల దుస్తులతో బయలుదేరుతాడు. చోరీకి ముందు ఒక రకం ధరిస్తే, చోరీ ముగిసిన తర్వాత మరొకటి ధరిస్తాడు.
- గతేడాది అంబర్‌పేట్‌లో వృద్ధ దంపతుల హత్యలో ఒక్క ఆధారం కూడా చిక్కలేదంటే నిందితులు ఎంత పకడ్బందీగా ఆ దారుణానికి ఒడిగట్టారో అర్థమవుతోంది.
జైల్లో పరిచయాలు కాపాడుతున్నాయి : జైల్లో ఏర్పడిన పరిచయాలతో నిందితులు ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటున్నారు. పోలీసులకు చిక్కిన తప్పిదాలను పంచుకుంటారు. గత అనుభవాలతో జైలులో ఎవరెవరిని కలుస్తున్నారు. విడుదలయ్యాక వారి కదలికలపై నిఘా ఉంటుందని పోలీసులు తెలుపుతున్నారు.
ఆరేళ్ల క్రితం ఓ మోసం కేసులో రిమాండ్ ఖైదీ జైలుకెళ్లాడు. ఆ తర్వాత విడుదలయ్యాడు. న్యాయస్థానంలో విచారణకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అతడి ప్రొఫైల్‌ను సామాజిక మాధ్యమాల్లో గుర్తించి పోలీసులు ఆ దొంగను అరెస్టు చేశారు. ఇలా దొంగతనం, మోసం, హత్యా నేరాలకు పాల్పడుతున్న నిందితులు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. చోరీ ప్రాంతంలో సీసీటీవీల వైర్లు కత్తిరించడం, సీసీ కెమెరాకు ఏదైనా అడ్డంకి పెట్టడం, వాటిని పగులకొట్టడం, హార్డ్ డెస్క్‌లను ఎత్తుకెళ్లడం లాంటివి చేస్తున్నారు.
అర్ధరాత్రి ఇంట్లోకి దొంగతనానికి వచ్చారు - అమెరికాలో ఉంటున్న యజమాని షాక్ ఇచ్చాడు
అర్థరాత్రి వచ్చాడు, విన్యాసాలు చేశాడు, వెళ్లిపోయాడు - ఎందుకో తెలుసా?