TGSRTC Announces Special Buses for IPL Matches in Uppal : హైదరాబాద్ నగరంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లు తిలకించే క్రికెట్ అభిమానుల కోసం టీజీఎస్ఆర్టీసీ తీపి కబురు అందించింది. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు వచ్చే క్రికెట్ ప్రేక్షకుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు వచ్చేందుకు గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
హైదరాబాదులో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా క్రికెట్ ప్రేక్షకుల కోసం టీజీఎస్ఆర్టిసీ ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పిచనుంది. ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియంకు వెళ్లేవారికి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు గ్రేటర్ ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది.
ఏఏ తేదీల్లో : గ్రేటర్ పరిధిలోని 24 డిపోల నుంచి 60 స్పెషల్ బస్సులను ఆర్టీసీ నడపనుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్న తేదీల్లో ఈ ప్రత్యేక బస్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. మార్చి 27, ఏప్రిల్ 6, ఏప్రిల్ 12, ఏప్రిల్ 23, మే 5, మే 10, మే 20 21 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లకి ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులను ఏర్పాటు చేసింది ఆర్టీసీ.
ఎక్కడ నుంచి : ప్రధానంగా ఘట్కేసర్, హయత్ నగర్, ఎన్జీవోస్ కాలనీ, ఎల్బీనగర్, కోఠి, లక్డీకపూల్, దిల్సుఖ్ నగర్, మేడ్చల్, కెేపీహెచ్పీ, మియాపూర్, జేబీఎస్, ఈసీఐఎల్, బోయిన్ పల్లి, చార్మినార్, చాంద్రాయణ గుట్ట, మెహదీపట్నం, బీహెచ్ఈఎల్ వంటి వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు ఆర్టీసీ స్పెషల్ బస్సు నడపనుంది.
IPL కెరీర్లో 9టీమ్‌లు మారిన క్రికెటర్- అన్ని ఫ్రాంచైజీలు కవర్ చేశాడుగా!
CSKను ఆటాడుకున్న ఆటో డ్రైవర్ కొడుకు! ధోనీ కన్నుల్లో పడ్డాడుగా? ఎవరీ విఘ్నేశ్ పుతుర్?