ETV Bharat / state

డార్క్‌వెబ్‌లో డ్రగ్స్​ దందా - మూలాలను ఛేదించేందుకు దర్యాప్తు ముమ్మరం - Drugs Buying through Dark Web

Drugs Buying through Dark Web : మాదకద్రవ్యాలను మత్తు బాబులు డార్క్‌వెబ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు టీజీన్యాబ్‌ విచారణలో తేలింది. మత్తుపదార్థాలను డార్క్‌వెబ్‌ ద్వారా కావాల్సినచోటుకు తెప్పించుకుంటున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ చిక్కడంతో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. మాదకద్రవ్యాల కట్టడికి పోలీసులు చర్యలు చేపట్టడంతో కొందరు అక్రమార్కులు తమదందాను ఇతర దారుల ద్వారా కొనసాగిస్తున్నారు. ఈ తరహా అక్రమార్కులపై నిఘా పెట్టి మాదకద్రవ్యాలను పూర్తిస్థాయిలో కట్టడికి టీజీ న్యాబ్‌ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 11, 2024, 6:53 AM IST

TGNAB Reveals Drugs Buying Issue
Drugs Buying through Dark Web (ETV Bharat)

TGNAB Reveals Drugs Buying Issue : డార్క్‌వెబ్‌ ద్వారా మత్తుపదార్థాల కొనుగోలు వ్యవహారం బయటపడడం సంచలనం రేపింది. ఖమ్మంకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కాలేజీలో చదివేటప్పుడు మత్తుపదార్థాలకి అలవాటయ్యాడు. పోలీసుల నిఘాతో ఏజెంట్లు సరుకు అందించేందుకు వెనుకాడటంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయత్నించాడు. డార్క్‌వెబ్‌లో డ్రగ్స్‌ కొనుగోలు చేసేందుకు, చైనా పోర్టల్‌ నుంచి భారతీయ కరెన్సీను క్రిప్టోగా మార్చి గత నెల 31న సుమారు 3 గ్రాముల సింథటిక్‌ డ్రగ్స్‌ ఆర్డరిచ్చాడు.

ముందస్తుసమాచారంతో ఆ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై టీజీ న్యాబ్‌ పోలీసులు నిఘాపెట్టారు. డార్క్‌వెబ్‌ ద్వారా గతనెల 31న మత్తుపదార్ధాలకు ఆర్డర్‌ ఇవ్వగా ఈనెల 8న అసోంలోని సిల్‌గురి నుంచి స్పీడ్‌ పోస్టు ద్వారా వచ్చింది. ఆ స్పీడ్‌పోస్టును తీసుకుంటున్న సమయంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఆనంతరం ఆ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ నిర్వహించారు. మత్తు మహమ్మారి నుంచి బయటపడడానికి చేయూత అందజేస్తామని స్పష్టం చేశారు.

డ్రగ్స్​ నిర్మూలనకు అందరం కలిసి పోరాడాలని పోలీసులు పిలుపు : డార్క్‌వెబ్‌ ద్వారా అతడు ఇప్పటికే నాలుగుసార్లు ఎల్‌ఎస్‌డీ, హెరాయిన్‌ తెప్పించుకున్నట్టు టీజీ న్యాబ్‌ సమాచారం సేకరించింది. డార్క్‌వెబ్‌ ద్వారా మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్న వారిపై నిఘా అధికం చేస్తామని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కి అసోం నుంచి ఎవరు పంపించారనే పోలీసులు లోతుగా ఆరాతీస్తున్నారు. ఇంకా ఎంత మంది ఇందులో ఉన్నారనే అంశాలపై, డార్క్‌వెబ్‌ లింకులను ఛేదించేందుకు డీఆర్ఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మూలాల్లోకి వెళ్లి కీలక సరఫరాదారుల ఆటకట్టిస్తామని చెబుతున్నారు.

మత్తు పదార్థాల బారిన పడితే అనేక అనర్థాలు జరుగుతాయని యువత వాటి ఉచ్చులో చిక్కుకోకుండా జాగ్రత్తలు పాటించాలని టీజీ న్యాబ్‌ పోలీసులు కోరుతున్నారు. తమ పిల్లల కదలికలను తల్లిదండ్రులు ఎప్పుడూ గమనిస్తూ ఉండాలని ఏమాత్రం అనుమానం వచ్చినా, పోలీసులకు సమాచారం అందించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే ఫోన్‌ నెంబర్‌ 8712671111 లేదా 1908 ఫోన్‌ చేయాలని సూచించారు. అదేవిధంగా అధికారిక ఈమెయిల్​ పోర్టల్​ tsnabho-hyd@tspolice.gov.in ద్వారా సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

డార్క్ ​వెబ్​ ద్వారా డ్రగ్స్ కొనుగోలు - సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ను అరెస్ట్​ చేసిన పోలీసులు - police caught the drug buyer

తెలంగాణ ఖాకీలు అడ్డుకుంటున్నా - అంతరాష్ట్ర పోలీసులు సహకరిస్తున్నారు! - TGNAB police Fight Against Drugs

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.