ETV Bharat / state

వైద్య ప్రవేశాలకు స్థానికత వ్యవహారం - సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం - TG Govt petition in Supreme Court

TG Govt petition in Supreme Court : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో ప్రవేశాలకు స్థానికత అంశంపై ప్రభుత్వ నిబంధనను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. విచారణకు వెంటనే స్వీకరించాలని సీజేఐ ధర్మాసనంను కోరింది.

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2024, 2:54 PM IST

Updated : Sep 12, 2024, 5:20 PM IST

TG Govt petition in Supreme
TG Govt petition in Supreme Court Medical Colleges admissions for Locals (ETV Bharat)

TG Govt petition in Supreme Court Medical admissions : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో ప్రవేశాలకు స్థానికత అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తెలంగాణలోని మెడికల్, డెంటల్‌ కళాశాలల్లో చేపట్టనున్న ప్రవేశాల్లో తెలంగాణలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు అవకాశం కల్పించాల్సిందేనని ఇటీవల హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

మెడికల్‌ అడ్మిషన్‌ల నిబంధనలు : మెడికల్‌ అడ్మిషన్‌ల నిబంధనలకు జీవో 33 ద్వారా చేసిన సవరణ 3(ఏ)ను రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఉన్నవారంతా 85% స్థానిక కోటా కింద ప్రవేశాలు పొందే అవకాశం ఉందని పేర్కొంది. ఈ కారణంగానే ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ జీవోను రద్దు చేయడం లేదని తన 71 పేజీల తీర్పులో పేర్కొంది. అయితే, విద్యార్థుల స్థానికతను నిర్ధారించడానికి ఎలాంటి మార్గదర్శకాలు లేవని, వాటిని రూపొందించే అవకాశాన్ని ప్రభుత్వానికి ఇస్తున్నామని తెలిపింది.

తెలంగాణలో చదువుకోలేదన్న కారణంతో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ అడ్మిషన్‌ నిరాకరించరాదని ఆదేశాల్లో పేర్కొంది. తాజాగా హైకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వద్ద తెలంగాణ తరఫు న్యాయవాది మెన్షన్‌ చేశారు. త్వరగా విచారణకు తీసుకుంటామని సీజేఐ ధర్మాసనం తెలిపింది.

వైద్య ప్రవేశాలపై ప్రభుత్వం జీవో : నీట్ రాసే సమయానికి వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలో చదివిన విద్యార్థులనే స్థానికులుగా పరిగణించాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. జీవోను సవాల్ చేస్తూ పలువురు నీట్ విద్యార్థులు అప్పట్లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీని వల్ల తెలంగాణ విద్యార్థుల్లో కొంతమంది స్థానికేతరులు అవుతున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

ప్రభుత్వ నిబంధనను కొట్టివేసన హైకోర్టు : దీంతో హైకోర్టు ప్రభుత్వ నిబంధనను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. స్థానికంగా నివాసం ఉండే విద్యార్థులను స్థానికులుగా పరిగణించాలని అయితే స్థానికత విషయంలో ప్రభుత్వ మార్గనిర్దేశకాలు సరిగా లేవని ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు సరైన మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ మార్గ నిర్దేశకాలకనుగుణంగా కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ప్రవేశాలు - ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో స్థానికతపై హైకోర్టు తీర్పు - HC on Medical Admissions for local

ఎంబీబీఎస్​, బీడీఎస్​ ప్రవేశాల్లో స్థానికతను పక్కకు పెట్టి ఆన్​లైన్​ దరఖాస్తులు తీసుకోండి : హైకోర్టు - Telangana HC on MBBS Admissions

Last Updated : Sep 12, 2024, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.