ETV Bharat / state

పుంగనూరులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి పర్యటన - ఉద్రిక్తత - MP Mithun Reddy Response - MP MITHUN REDDY RESPONSE

MP Mithun Reddy Response on Punganur Incident : చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డి పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఘటన పై ఎంపీ మిథున్‍ రెడ్డి స్పందిస్తూ టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహిస్తూ టీడీపీ హింసాత్మక చర్యలతో పుంగనూరు అభివృద్ది అగిపోతుందన్నారు.

mp_mithun_reddy_response_on_punganur_incident
mp_mithun_reddy_response_on_punganur_incident (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 18, 2024 at 11:39 AM IST

Updated : July 18, 2024 at 12:28 PM IST

2 Min Read
పుంగనూరులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి పర్యటన - ఉద్రిక్తత (ETVBharat)

Tension in MP Mithun Reddy Tour : గురువారం రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి చిత్తూరు జిల్లా పుంగనూరులో పర్యటించారు. మిథున్‌రెడ్డి పర్యటనను నిరసిస్తూ ఎన్డీయే కార్యకర్తల ర్యాలీ చేపట్టారు. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి ఎంపీ మిథున్‌రెడ్డి వెళ్లడంతో ఎన్డీయే కార్యకర్తలు నిరసనకు దిగారు. రెడ్డప్ప ఇంటి వద్ద గోబ్యాక్‌ మిథున్‌రెడ్డి అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్డీయే కార్యకర్తలపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఎన్డీయే కార్యకర్తల ఎదురు దాడితో పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఇరువర్గాలను అదుపు చేసేందుకు పోలీసుల యత్నించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మిథున్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.

'పుంగనూరులో మీ అరాచకాలు గుర్తులేవా? - Tdp Punganur Incharge fire on MP

MP Mithun Reddy Response on Punganur Incident : పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్‍ రెడ్డి స్పందించారు. ప్రజలను పక్క దారి పట్టించేందుకే ప్రభుత్వం ఇలాంటి దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు. పుంగనూరులోని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ హింసాత్మక చర్యలతో పుంగనూరు అభివృద్ది అగిపోతుందన్నారు. గతంలో పుంగనూరులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. దాడులకు భయపడమని రాజకీయంగా ఎదుర్కుంటామన్నారు. దాడులను అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అడుగంటాయని, బిహార్‍ కంటే పరిస్ధితులు దిగజారయన్నారు.

ఇంతకుముందు సైతం ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలసి పుంగనూరు పర్యటనకు వెళ్లగా ఇటువంటి ఘటనే జరిగిన సంగతి తెలిసిందే. స్థానికులు, టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి గో బ్యాక్ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. గడచి ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉంటూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అధికారం కోల్పోయాక పుంగనూరు పర్యటన పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రగిలించేందుకు యత్నిస్తున్నారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. వారు అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది అన్యాయానికి గురయ్యారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధిపొందేందుకు చేసే పర్యటనలు అంగీకరించమని కూటమి నాయకులు ప్రకటించారు.

పుంగనూరులో ఉద్రిక్తత- మిథున్‌ రెడ్డి పర్యటనను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు - Alliance Leaders Protest

Last Updated : July 18, 2024 at 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.