TET 2025 Schedule : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్-2025)కు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన, ఆసక్తికలిగిన అభ్యర్థులు ఈ నెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ వెల్లడించింది. తెలంగాణ టెట్ మొదటి విడత నోటిఫికేషన్‌ను ఇటీవల విద్యాశాఖ అధికారులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. జూన్‌లో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఎస్‌జీటీ ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్-1, ఎస్‌ఏ ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పేపర్-2లో 2 వేరు వేరు పేపర్లు (సాంఘికశాస్త్రం, గణితం-సైన్స్) ఉంటాయి. ఈసారి ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000 రుసుంగా నిర్ణయించారు. టెట్‌కు కనీసం రెండు లక్షల మంది పోటీపడే అవకాశం ఉంది. గత జనవరిలో జరిగిన 2024 టెట్-2 పరీక్షకు 2,75,753 మంది దరఖాస్తు చేశారు. అందులో 2,05,278 మంది పరీక్ష రాశారు. వారిలో 83,711 మంది కనీస మార్కులు సాధించి డీఎస్సీకి అర్హత పొందారు. ఈ టెట్ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. ఓసీలకు-90, బీసీ-75, మిగిలిన వారికి 60 మార్కులు వస్తే ఉత్తీర్ణులు అవుతారు.
టెట్-2025 దరఖాస్తుల కోసం క్లిక్ చేయండి
టెట్-2025 షెడ్యూల్ : -
- నోటిఫికేషన్ జారీ : ఏప్రిల్ 11
- ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణ : ఈ నెల 15 నుంచి 30 వరకు
- హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ : జూన్ 9 నుంచి
- ఆన్‌లైన్ పరీక్షల తేదీలు : జూన్ 15 నుంచి 30 మధ్య
- పరీక్షల సమయం : ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు (రోజుకు 2 విడతలు)
- ఫలితాల వెల్లడి : జులై 22న