ETV Bharat / state

ఇప్పుడు మేం ఇంటికెళ్లాలా? క్యాంపస్​లకా? - సందిగ్ధంలో విద్యార్థులు - AMID INDIAPAK TENSION

దేశ సరిహద్దుల్లో తగ్గిన ఉద్రిక్తతలు - దిల్లీలోని తెలంగాణభవన్​లోనే తెలంగాణ విద్యార్థులు - ఇంటికెళ్లాలా? క్యాంపస్​లకా? అనే సందిగ్ధంలో విద్యార్థులు

Amid India-Pak Tension
Amid India-Pak Tension (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 13, 2025 at 8:40 AM IST

2 Min Read

Amid India-Pak Tension Telangana Students Stay in Telanganabhavan : దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్​తో ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్ముకశ్మీర్​, పంజాబ్​ రాష్ట్రాల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు ఇంటి బాట పట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రానికి చెందిన విద్యార్థులు దిల్లీలోని తెలంగాణభవన్​లో బస చేస్తున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలను అందిస్తోంది. అయితే ఇప్పుడు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో ఇంటికెళ్లాలా? లేదంటే క్యాంపస్​లకు తిరిగి వెళ్లాలా? అనే సందిగ్ధంలో విద్యార్థులు ఉన్నారు.

ఉద్రిక్తతల పరిస్థితుల కారణంగా కశ్మీర్​, పంజాబ్​ రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఇంటికి పయనమై దిల్లీకి చేరుకునేసరికి భారత్​, పాకిస్థాన్​లు కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయి. ఈ నేపథ్యంలో అందరూ తిరిగి క్యాంపస్​లకు చేరుకునేలా కళాశాలల నుంచి సందేశాలు విద్యార్థులకు వచ్చాయి. కాల్పుల విరమణ జరిగినా ఎప్పుడు ఎలాంటి సంఘటన జరుగుతుందోనని విద్యార్థుల్లో ఆందోళన ఉంది. ఈ క్రమంలో విద్యార్థులు ఇంటికి వెళ్లాలా, లేదంటే క్యాంపస్​లకు తిరిగి వెళ్లాలా? అన్న సందిగ్ధంలో పడిపోయారు.

ఈ విషయంపై దిల్లీలోని తెలంగాణభవన్​లో బస చేస్తున్న విద్యార్థులతో సోమవారం తెలంగాణ భవన్​ రెసిడెంట్​ కమిషనర్​ గౌరవ్​ ఉప్పల్​ మాట్లాడారు. ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తాము ముందుగా ఇంటికెళ్లి పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే క్యాంపస్​లకు వెళతామని వారంతా చెప్పారు. వారి మనోభావాలను గ్రహించి గౌరవ్​ ఉప్పల్​ సంబంధిత యూనివర్సిటీల అధికారులతో మాట్లాడారు. విద్యార్థులు మానసికంగా పూర్వస్థితికి వచ్చేంత వరకూ తాత్కాలికంగా ఆన్​లైన్​ తరగతులు నిర్వహించాలని కోరారు.

ఫైనల్​ ఇయర్​ విద్యార్థులు దిల్లీలోనే : అందుకు యూనివర్సిటీలు కూడా సానుకూలంగా స్పందించాయి. కొంతమంది ఫైనల్​ ఇయర్​ విద్యార్థులు పరిస్థితి మెరుగుపడే వరకు దిల్లీలోనే ఉండి తిరిగి క్యాంపస్​లకు వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పడంతో అందుకు రెసిడెంట్​ కమిషనర్​ సైతం అంగీకారం తెలిపారు. అంతవరకూ వారికి తెలంగాణ భవన్​లోనే వసతి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం వరకు తెలంగాణ భవన్​కు మొత్తం 162 మంది విద్యార్థులు చేరుకోగా, అందులో కొందరు వారి స్వస్థలాలకు వెళ్లగా, మిగిలిన వారు ఇక్కడే బస చేస్తున్నారు.

'రాత్రంతా బాంబుల శబ్ధం - భయంతో నిద్రలేకుండా అలానే ఉండిపోయాం'

ఉగ్రవాదులకు ఊహించని చావుదెబ్బ-పాక్ న్యూక్లియర్​ బ్లాక్​మెయిల్స్​కు భయపడేది లేదు : మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.