Minister Sridhar Babu On Education System : పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్ లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. కోచింగ్ సెంటర్లపై ఎటువంటి నియంత్రణ లేకపోవడం వల్ల అభ్యర్థుల భద్రత, ఫీజుల భారంపై ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయామని ఆయన తెలిపారు. కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడతామని స్పష్టం చేశారు. ఇవాళ జరిగిన కేబినెట్ సబ్-కమిటీ సమావేశంలో పలు అంశాలపై మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 11 September 2024
Telangana News Today Live : తెలంగాణ Wed Sep 11 2024 లేటెస్ట్ వార్తలు- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడతాం : మంత్రి శ్రీధర్‌బాబు - Sridhar Babu On Coaching Institutes
Published : Sep 11, 2024, 9:42 AM IST
|Updated : Sep 11, 2024, 10:57 PM IST
కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడతాం : మంత్రి శ్రీధర్‌బాబు - Sridhar Babu On Coaching Institutes
మార్చిలోపు 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలి : డిప్యూటీ సీఎం భట్టి - DY CM BHATTI ON YADADRI POWER PLANT
Deputy CM Bhatti Vikramarka Review On Yadadri Power Plant : గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాలేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రాజెక్టుపై నిత్యం సమీక్షలు జరపకుండా పక్కన పెట్టడం వల్లే వ్యయం మరింత పెరిగి ప్రభుత్వంపైన ఆర్థిక భారం పడిందన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి వారం వారం క్యాలెండర్ ఖరారు చేశామని 2025 మార్చి 31 నాటికి ఐదు యూనిట్లు అందుబాటులోకి తీసుకువచ్చి 4,000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని డిప్యూటీ సీఎం అన్నారు. | Read More
విద్యుత్ స్తంభాలకు అడ్డదిడ్డంగా వేలాడుతున్న కేబుల్ వైర్లు - సీఎం ఆదేశాలతో రంగంలోకి విద్యుత్‌శాఖ - Dangling Cables A Threat
Dangling Cables A Threat To Residents : విద్యుత్ స్తంభాలకు అడ్డదిడ్డంగా వేలాడే కేబుళ్లను ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో అవి గాల్లో వేలాడుతున్నాయి. సాధారణ ప్రజలకు ప్రాణాంతకంగా పరిణమించాయి. వీటిపై పర్యవేక్షణ కొరవడడంతో కేబుళ్లను వేసిన వారు సైతం మర్చిపోయారు. భయంకరంగా వేలాడుతున్న ఈ కేబుళ్లతో పలువురు వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతో ఎస్పీడీసీఎల్ యాజమాన్యం ఇటువంటి అస్తవ్యస్థ కేబుళ్లపై దృష్టిసారించింది. ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్లతోనే కేబుళ్లను తొలగించే ప్రయత్నం చేస్తుంది. | Read More
ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతానికి పార్టీలు సహకరించాలి : సీఈవో సుదర్శన్‌రెడ్డి - CEO Meeting With Political Parties
CEO Meeting With Political Parties : రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల నమోదు పురోగతిపై రాజకీయ పార్టీలతో సీఈవో సుదర్శన్ రెడ్డి తన కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 11 రాజకీయపార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతం చేసేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జనవరి 1, 2025 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకునేందుకు ప్రక్రియను సులభతరం చేయనున్నట్లు తెలిపారు. | Read More
బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థికి గుండెనొప్పి - సకాలంలో స్పందించిన సిబ్బందికి సజ్జనార్ సన్మానం - MD SAJJANAR FELICITATES CONDUCTOR
MD Sajjanar Felicitates Conductor And Bus Driver : బస్సులో గుండె నొప్పితో బాధపడుతున్నఓ విద్యార్థికి సకాలంలో వైద్య సాయం అందించి ఉదారత చాటుకున్న తమ సిబ్బందిని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో వారికి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఉన్నతాధికారులతో కలిసి సన్మానించి, నగదు బహుమతులు అందజేశారు. | Read More
కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మసకబారింది : హరీశ్‌రావు - HARISH RAO ON HYDERABAD BRAND IMAGE
Harish Rao Slams Congress Govt : కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ప్రతిష్ఠ మసకబారిందని, రాజధాని బ్రాండ్ ఇమేజ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి చంపేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు ఆరోపించారు. ఈమేరకు నర్సాపూర్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రూ.800 కోట్ల ఉపాధిహామీ నిధులు సైతం దారి మళ్లించినట్లు ఆరోపించారు. | Read More
ఈనెల 17లోపు వరద బాధితులకు పరిహారం : ఏపీ సీఎం చంద్రబాబు - CM Chandrababu Visits Flooded Areas
Chandrababu Visit Flood Areas Today : ఓ వైపు వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుంటే, మరోవైపు బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజీ కొట్టుకుపోయేలా విధ్వంసానికి వైఎస్సార్సీపీ కుట్ర పన్నిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. గత సర్కార్ తప్పిదం వల్లే విజయవాడ అతలాకుతలమైందని తీవ్రంగా విమర్శించారు. ఐదేళ్ల దుర్మార్గ పాలనలో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టాయన్నారు. | Read More
తల్లీతండ్రిమరణంతో అనాథలైన ఇద్దరు బిడ్డలు - అండగా నిలిచిన గ్రామయువత - TWO ORPHAN GIRLS STORY IN MEDAK
Heartbreaking story Of Two Girls : చిన్ననాడే తల్లి దూరమైంది. ఊహ తెలిసి వస్తున్న సమయంలో తండ్రి మరణించడంతో ఆ ఇద్దరు ఆడ బిడ్డలు ఒంటరయ్యారు. ఓ వైపు పేదరికం మరోవైపు తల్లిదండ్రుల మరణం. విధి ఆడిన వింతనాటకంలో ఒంటరిగా మారిన ఇద్దరి బిడ్డల హృదయవిధారక ఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలకేంద్రంలో చోటుచేసుకుంది. వారి దయనీయపరిస్థితిని మంచి మనసుతో అర్థం చేసుకున్న ఆ ఊరి యువత ఆ ఇద్దరి బిడ్డలకు అండగా నిలిచారు. చందాలు వేసుకుని వారికి నగదు సాయాన్ని అందించి తమ మంచి మనసును చాటుకున్నారు. | Read More
ప్రకాశం బ్యారేజీలో పడవల తొలగింపు ప్రక్రియ వేగవంతం - ముక్కలుగా కోసి తొలగించాలని నిర్ణయం - BOATS REMOVAL AT PRAKASAM BARRAGE
Boats Removal Process At Prakasam Barrage : ఏపీలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద విధ్వంసం సృష్టించి అక్కడే చిక్కుకుని ఉన్న పడవల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. గేట్ల వద్ద చిక్కుకున్న భారీ పడవలను క్రేన్లతో ఎత్తి తీయడం సాధ్యపడక పోవడం వల్ల వాటిని ముక్కలు చేయాలని అధికారుల నిర్ణయించారు. | Read More
'ఇప్పటివరకు 262 అక్రమ నిర్మాణాల కూల్చివేత' - ప్రభుత్వానికి హైడ్రా లేటెస్ట్ రిపోర్టు - HYDRA DEMOLITIONS REPORT LATEST
Hydra Land Recovery Details : కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ పరిసరాల్లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా, ఇప్పటివరకు 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. మొత్తం 23 ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో కట్టిన 262 అనధికారిక నిర్మాణాలు కూల్చేసినట్టు ప్రభుత్వానికి నివేదించింది. | Read More
ఖైరతాబాద్ గణేశుడికి భారీ ఎత్తున రుద్రహోమం - 280 జంటలతో ప్రత్యేక పూజ - Khairatabad Ganesh Pooja
Khairatabad Ganesh Pooja 2024 : వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్‌లోని సప్తముఖ మహాశక్తి గణేశుడి వద్ద లక్ష్మీ గణపతి రుద్ర హోమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజలో ఏకంగా 280 జంటలు పాల్గొన్నాయి. | Read More
'పసికందును పీక్కుతిన్న కుక్కలు' - ఆ వార్త నా మనసును కలిచివేసింది : హరీశ్ రావు - HARISH RAO ON DOG ATTACKS IN TG
Harish Rao Tweet on Dog Bites : రాష్ట్రంలో కుక్కకాట్లకు చిన్నారులు బలవుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. "పసికందును పీక్కుతిన్న కుక్కలు" అనే వార్త తన మనసును కలచివేసిందని ఆవేదన చెందారు. ఇలాంటి హృదయ విదారక ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. | Read More
సైబర్ నేరగాళ్ల వికృత చేష్టలు - టార్గెట్ రీచ్ కాకుంటే 15 అంతస్తుల భవనం 7సార్లు ఎక్కాలి - hyderabad man escape Laos cyber den
Hyderabad man Daring Escape from Laos : భారతీయ యువకుల్ని విదేశాల్లో బంధించి సైబర్ నేరాలు చేయిస్తున్న ముఠాల విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కంబోడియా, మయన్మార్ దేశాల్లో ఈ ముఠాల స్థావరాలు ఉన్నట్లు గతంలో బహిర్గతమయ్యాయి. తాజాగా హైదరాబాద్ యువకుడితో పాటు పలువురిని నిర్భందించి సైబర్ నేరాలకు ప్రయత్నాలు చేస్తున్నారు. సైబర్ నేరాలు చేయడానికి ఒప్పుకోపోతే చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆ ముఠా సభ్యుల నుంచి అతి కష్టం మీద తప్పించుకొని నగరానికి చేరుకున్న బాధితుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. | Read More
వరద ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన - Central Team Visit telangana
Central Team Visit Flood Affected Areas Today : రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు కేంద్ర బృందం పర్యటించింది. మొదట సచివాలయంలో వరద వల్ల జరిగిన నష్టాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు. అనంతరం జిల్లాలకు కేంద్రం బృందం రెండు టీంలుగా విడిపోయి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లింది. | Read More
గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం - హైదరాబాద్, జగిత్యాలలో అంతర్రాష్ట్ర ముఠాల అరెస్టు - GANJA SMUGGLING GANGS BUSTED IN TG
Ganja Gang Arrested in Hyderabad : అంతరాష్ట్ర గంజాయి ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి ఎన్నో కేసులు వెలుగు చూస్తున్నాయి. కాస్త అనుమానం వస్తే చాలు రంగంలోకి దిగి ఒక్కొక్క విషయాన్ని వెలికితీస్తున్నారు. దీని కోసం పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడి స్మగ్లింగ్ జరిగే ప్రదేశాల్లోకి ప్రవేశించి మరీ అన్వేషిస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్- రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ వద్ద గంజాయిని తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. | Read More
కూల్చివేతలపై స్టే తెచ్చుకున్నా - కోర్టుల్లో కొట్లాడుతాం : సీఎం రేవంత్ రెడ్డి - CM REVANTH ON HYDRA DEMOLITIONS
Cm Revanth On Illegal Encroachments in Hyderabad: కొందరు పెద్దలు ప్రాజెక్టుల వద్ద ఫాంహౌస్‌లు కట్టుకున్నారని, ఫాంహౌస్‌ల నుంచి వచ్చే డ్రైనేజీని గండిపేటలో కలుపుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆక్రమణలను కూల్చే బాధ్యత తాను తీసుకుంటానని, కూల్చివేతలపై స్టే తెచ్చుకున్నా కోర్టుల్లో కొట్లాడుతామని స్పష్టం చేశారు. | Read More
గచ్చిబౌలిలో రేవ్‌పార్టీ భగ్నం - 18 మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు - rave party in hyderabad
Rave party Busted in Hyderabad : ఓ గెస్ట్‌హౌస్‌లో సాప్ట్వేర్ ఉద్యోగులు నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 18 మంది యువతి, యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి గంజాయి, ఈ-సిగరెట్లు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. | Read More
సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ - రూ.కోటి చెక్ అందజేత - ap deputy cm donates 1 crore to Tg
AP Deputy CM Pawan Kalyan meet CM Revanth Reddy : సీఎం రేవంత్‌రెడ్డితో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళాన్ని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అందించారు. | Read More
విశాఖపట్నం సెంట్రల్ జైలు వద్ద రౌడీ షీటర్ హల్చల్ - ఆపై పోలీసులతో దురుసు ప్రవర్తన - Man Halchal at Central Prison
Rowdy Sheeter Halchal in Central Prison Visakhapatnam : ఏపీలోని విశాఖపట్నం సెంట్రల్ జైలు గేటు వద్ద రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. ఆర్మీ రిజర్వ్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. జైల్లోకి వెళ్లకుండా ప్రధాన ద్వారం వద్దనే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. | Read More
ఆర్టీసీకి కొత్త కళ - కొత్త బస్సుల కొనుగోలుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ - CM Revanth on TGSRTC New Buses
CM Revanth on TGSRTC : రాష్ట్రవ్యాప్తంగా ప్రజా అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో టీజీఎస్ఆర్టీసీపై సమీక్ష నిర్వహించిన ఆయన, మహాలక్ష్మి పథకం అమలు తీరుపై ఆరా తీశారు. | Read More
స్థలం కనిపిస్తే చాలు కబ్జానే - ఇది ఆదిలాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారుల తీరు - Land mafia occupy ponds in Adilabad
Land mafia in Adilabad : స్థిరాస్తి వ్యాపారుల భూ కబ్జాలకు అంతే లేకుండా పోతుంది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేసేస్తారు. ఆదిలాబాద్‌లో చెరువులను, ప్రభుత్వ స్థలాలను కూడా వదలడం లేదు. ఈ ఆక్రమణలు ప్రముఖ నేతలు, అధికారుల కనుసన్నుల్లోనే జరుగుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. | Read More
ప్రకాశం బ్యారేజీలో పడవలను వెలికి తీసేందుకు ప్లాన్ 'బి' - ముక్కలు చేయడమే మార్గంగా ప్రణాళిక - Removing Boats in Prakasam Barrage
Officials on Boats in Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కున్న భారీ పడవలను వెలికి తీసేందుకు ఇంజినీర్లు, అధికారులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. బాహుబలి క్రేన్లు 5 గంటల పాటు శాయశక్తులా ప్రయత్నించినా నదిలో చిక్కుకున్న పడవలు ఒక్క అంగుళం కూడా కదల్లేదు. తొలి ప్రణాళిక విఫలం కావడంతో నేడు మరో ప్లాన్‌ను అమలు చేయాలని ఇంజినీర్లు నిర్ణయించారు. | Read More
మద్యం సీసాలను ఎత్తుకెళ్లిన మందుబాబులు - ప్రశ్నించిన పోలీసులకు దిమ్మతిరిగే షాక్! - COPS DESTROY LIQUOR IN GUNTUR IN AP
Drunkards Loot Liquor in Andhra Pradesh: ఏపీలోని గుంటూరు జిల్లాలో ఓ డంపింగ్ యార్డులో జరిగిన తతంగాన్ని చూసిన మందుబాబులు తట్టుకోలేకపోయారు. పోలీసులు అడ్డుకున్నా తగ్గేదేలేదంటూ ఎగబడ్డారు. ఒక్కసారిగా గుంపులుగా వచ్చి తమకు చేతికందిన మద్యం బాటిల్ పట్టుకుని ఊడాయించారు. ఎందుకని పోలీసులు ప్రశ్నిస్తే 'చూస్తూ ఉండలేకపోయాం సార్' అంటూ మందుబాబులు బదులిచ్చారు. | Read More
నాలాల ఆక్రమణలపై హైడ్రా ఫోకస్ - వర్షాకాలంలోపు తొలగించేందుకు ప్రణాళిక - Hydra Nala Operation
Hydra Focus on Nalas in Hyderabad : హైదరాబాద్ మహానగరంలో చెరువుల ఆక్రమణలపై కొరడా ఝులిపిస్తోన్న హైడ్రా ఇక నుంచి కొన్నిరోజులపాటు నాలాలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సిద్ధమవుతోంది. ఈ వర్షాకాలం పూర్తయ్యేలోగా నాలాలను ఆక్రమించి కట్టిన నివాసేతర నిర్మాణాలను తొలగించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వాటి జాబితాను సిద్ధం చేసిన హైడ్రా వరద నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డులేకుండా చూసేందుకు ఒక్కొక్కటిగా తొలగించాలని భావిస్తోంది. | Read More
మున్నేరు దాటికి ఆనవాళ్లు కోల్పోయిన సరస్వతి నిలయాలు - చదువులు సాగేదెలా! - Munneru Floods Damage Schools
Heavy Floods Damge Schools in Khammam : భారీ వర్షాలు, వరదలు ఖమ్మం జిల్లాలో విద్యావ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. వరదలతో జిల్లాలోని అనేక ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా ఆనవాలు కోల్పోయాయి. బురద మేటలు వేసిన పాఠశాల ఆవరణలు, తరగతి గదులను శుభ్రం చేసేందుకు రోజుల తరబడి కేటాయించాల్సి వస్తోంది. ఒక్కో పాఠశాలకు లక్షల్లో నష్టం వాటిల్లింది. జిల్లాలో మొత్తం 68 ప్రభుత్వ పాఠశాలల్లో దాదుపు రూ.1.20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు విద్యాశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేసి జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందించారు. | Read More
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం, ఏడుగురు మృతి - Seven Died in Accident in Godavari
Seven died in Road Accident in Godavari : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు త్రీవంగా గాయపడ్డారు. | Read More
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం - 50.5 అడుగులకు చేరిన నీటిమట్టం - flood situation in godavari
Rising flood of Godavari at Bhadrachalam : భద్రాచలం వద్ద గోదావరిలో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం 50.5 అడుగులకు చేరింది. ఈ నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. క్రమంగా నీటిమట్టం పెరగడంతో విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. | Read More
కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు : సీఎం రేవంత్‌రెడ్డి - CM Revanth Koti Womens University
Koti Womens University Name Change : కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పాత్ర మరవలేనిదని కొనియాడారు. భూముల ఆక్రమణలు అడ్డుకోవడంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఆమె స్ఫూర్తి అని చెప్పారు. | Read More