Human Rights Commission on Gulzar House Fire Incident : హైదరాబాద్‌లోని పాతబస్తీ గుల్జార్ హౌస్ సమీపంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై తెలంగాణ హ్యుమన్ రైట్స్ కమిషన్ స్పందించింది. ఘటనను సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ కేసును విచారణ చేయడానికి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. భవన భద్రత, విద్యుత్ నిర్వహణపై ప్రముఖ వార్తా పత్రికలు, మీడియాలో కథనాలు రావడంతో కమిషన్ స్పందించింది.
రిపోర్ట్ సమర్పించండి : అగ్ని ప్రమాద ఘటనలో 17 మంది(8 మంది చిన్నారులు, ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు) మృతి చెందడంపై జూన్ 30వ తేదీ లోగా రిపోర్ట్ సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తోపాటు అగ్నిమాపక డెరెక్టర్ జనరల్, టీజీఎస్పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్లు, హైదరాబాద్ పోలీసు కమిషనర్లకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. చార్మినార్ పరిధిలో ఆదివారం(మే 18న) గుల్జార్‌హౌస్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 17 మంది మరణించిన సంగతి తెలిసిందే.
మొదటి అంతస్తులో మంటలు : మృతుల్లో ఎనిమిది మంది చిన్న పిల్లలున్నారు. ఆదివారం ఉదయం భవనం మొదటి అంతస్తులో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న కొందరిని ఫైర్ సిబ్బంది రక్షించి ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించి ట్రీట్మెంట్ అందించారు.
సంధ్య థియేటర్ ఘటన - ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు
'మహిళా పోలీసులు ఉన్నారా ? అరెస్టు చేసిన వారిని కొట్టారా ?' - లగచర్ల ఘటనపై ఎన్హెచ్ఆర్సీ విచారణ