ETV Bharat / state

'ఒకసారి తేల్చిన అంశంపైనే మరోసారి పిటిషన్ ఎలా వేస్తారు' - బీఆర్​ఎస్​ ఆఫీస్​ కూల్చివేత వివాదంపై హైకోర్టు సీరియస్ - TG HC on BRS Office in Nalgonda

TG HC on Nalgonda BRS Office : నల్గొండ జిల్లాలో బీఆర్​ఎస్​ భవనం క్రమబద్ధీకరణ వివాదంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలోనే పార్టీ భవనం క్రమబద్ధీకరణపై తీర్పు ఇవ్వగా తిరిగి అదే అభ్యర్థనపై రెండోసారి పిటిషన్ దాఖలు ఎలా చేస్తారని నిలదీసింది. మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన కూల్చివేత ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు లక్ష రూపాయలు ఖర్చుల కింద నల్గొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది.

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2024, 10:24 PM IST

Telangana High Court of Nalgonda BRS Office
TG HC on Nalgonda BRS Office (ETV Bharat)

Telangana High Court of Nalgonda BRS Office : నల్గొండ జిల్లాలో భారత రాష్ట్ర సమితి పార్టీ భవనం క్రమబద్ధీకరణ వివాదంపై రెండోసారి పిటిషన్ దాఖలు చేయడంపై హైకోర్టు అగ్రహం వ్యక్తం చేసింది. ఒకసారి తేల్చిన అంశంపైనే మరోసారి పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. కోర్టు సమయం వృథా చేసినందుకు రూ. లక్ష రూపాయల ఖర్చుల కింద నల్గొండ న్యాయసేవాధికార సంస్థకు 4 వారాల్లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. క్రమబద్ధీకరణను తిరస్కరిస్తూ కూల్చివేత చర్యలు చేపడతామంటూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇచ్చిన నోటీసుల్లో జోక్యం చేసుకోలేమంటూ తేల్చి చెప్పింది.

నల్గొండ జిల్లా సర్వే నం 1506లో ఎకరం స్థలంలోని బీఆర్​ఎస్​ కార్యాలయ భవన నిర్మాణాన్ని క్రమబద్ధీకరణకు నిరాకరించడంతోపాటు జులై 30న మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన కూల్చివేత నోటీసును సవాలు చేస్తూ నల్గొండ బీఆర్​ఎస్​​ తరఫున మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీందర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి.వినోద్‌కుమార్ విచారణ చేపట్టారు. పార్టీ కార్యాలయం క్రమబద్ధీకరణ దరఖాస్తును తిరస్కరిస్తూ జులై 20న కమిషనర్ జారీ చేసిన ప్రొసీడింగ్‌ను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. అయితే ఇందులో జోక్యానికి హైకోర్టు నిరాకరిస్తూ చట్టప్రకారం ప్రత్యామ్నాయాలను చూసుకోవచ్చని సలహా ఇచ్చిందన్నారు.

పిటిషన్‌ను కొట్టివేస్తూ లక్ష రూపాయలు జరిమానా : కమిషనర్ ఉత్తర్వులను సవాలు చేయడానికి ప్రత్యామ్నాయంగా మున్సిపల్ ట్రైబ్యునల్ లేదని, అందువల్ల మళ్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. క్రమబద్ధీకరణను తిరస్కరణతోపాటు జులై 2న 15 రోజుల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని, లేని పక్షంలో మున్సిపాలిటీ తొలగిస్తుందని నోటీసులు జారీ చేసిందన్నారు. కూల్చివేత ఉత్తర్వుల అమలును నిలిపివేసి క్రమబద్ధీకరణ దరఖాస్తును పరిశీలించేలా ఆదేశించాలని కోరారు. ఈ సందర్భంగా ఆక్రమ నిర్మాణాలను కూల్చివేయవద్దంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావించారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎలాంటి అనుమతులేకుండా నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. అందువల్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమబద్ధీకరణ నిరాకరణ ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి గతంలోనే హైకోర్టు నిరాకరించగా తిరిగి అదే అభ్యర్థనపై మరో పిటిషన్ ఎలా వేస్తారని నిలదీశారు. సుప్రీం కోర్టు ఆదేశాలు అన్నింటికీ వర్తించవని మున్సిపాలిటీ నోటీసులు జారీ చేసి చర్యలు చేపడుతోందన్నారు. మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన కూల్చివేత ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ను జరిమానాతో కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే అభ్యర్థనపై రెండోసారి పిటిషన్ దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు లక్ష రూపాయలను నల్గొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.