Telangana High Court On Hydraa : హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కేవలం పేదల ఇళ్లనే కాకుండా పెద్దలవి కూడా కూల్చాలని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. పెద్దల భవనాలను కూల్చినప్పుడే సర్కారు భూములను రక్షించినట్లు అవుతుందని పేర్కొంది. మీరాలం ట్యాంకు పరిసరాల్లో ఇళ్ల ఓనర్లకు రాజేంద్రనగర్ తహసీల్దార్ ఇచ్చిన నోటీసులపై హైకోర్టులో పిటిషన్ చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ధర్మాసనం దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లో ఆక్రమణలను ఎందుకు తొలగించడం లేదని హైడ్రాను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. చెరువుల పరిరక్షణ మంచి విషయమే అయినప్పటికీ చట్టం దృష్టిలో అందరూ సమానమేనని తెలిపింది. మీరాలం ట్యాంకు చెరువు పరిసరాల్లో నిర్మాణాలు ప్రభుత్వ స్థలంలో ఉంటే తగిన చర్యలను తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.
రెండు కాలనీల మధ్య అడ్డుగోడ - స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి హైడ్రా
పెండింగ్ పిటిషన్లు 10 వేలకు పైగా ఉన్నాయి : హైడ్రా కమిషనర్ రంగనాథ్