ETV Bharat / state

మనుమళ్లకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ రద్దు చేయవచ్చా? - హైకోర్టు క్లారిటీ - HIGH COURT ON GIFT DEED PROPERTY

మనుమళ్లకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు - షరతులేని గిఫ్ట్ డీడ్‌లు రద్దు చేసే అధికారం ఆర్డీవోకు లేదంటూ వెల్లడి

Telangana High Court on Gift Deed Property
Telangana High Court on Gift Deed Property (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 12, 2025 at 10:24 PM IST

2 Min Read

Telangana High Court on Gift Deed Property : ప్రేమ, వాత్సల్యంతో మనుమళ్లకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను చట్ట విరుద్ధమైన ప్రక్రియ ద్వారా రద్దు చేయడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. సీనియర్ సిటిజన్స్ చట్టం కింద గిఫ్ట్‌ను రద్దు చేయాలంటే అందులో షరతులను ఉల్లంఘించి ఉండాలంది. కానుక ఇచ్చే ముందు రోజువారీ అవసరాలు, మందులు అందించాలన్న షరతు ఉండీ వాటిని అమలు చేయనప్పుడు మాత్రమే గిఫ్ట్‌ను రద్దు చేసుకునే హక్కు సీనియర్ సిటిజన్‌కు ఉంటుందని పేర్కొంది.

ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోని ఆధునిక ధోరణుల నేపథ్యంలో సీనియర్ సిటిజన్స్ వృద్ధులైన తల్లిదండ్రుల నిర్వహణ, సంక్షేమం దృష్టిలో ఉంచుకుని తీసుకువచ్చిన గొప్ప చట్టం సీనియర్ సిటిజన్ చట్టమని వ్యాఖ్యానించింది. ఎక్కువ కుటుంబాల్లో వృద్ధులైన తల్లిదండ్రుల వైద్యం, మందులు తదితర అత్యవసరాలను కూడా కనీసం పట్టించుకోవడంలేదని, ఇలాంటి సమయాల్లో పిల్లలు, బంధువులకు ఇచ్చిన గిఫ్ట్‌ను వారు రద్దు చేసుకోవచ్చంది. అయితే కేవలం ప్రేమ, వాత్సల్యంతో ఎలాంటి షరతులు లేకుండా ఇచ్చిన గిఫ్ట్‌లను రద్దు చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. తండ్రి ఇచ్చిన గిఫ్ట్‌పై వారసులకు అభ్యంతరాలుంటే సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చంది.

వాదనలు : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లో భవనంలోని 5, 6 అంతస్తులను 2019లో ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌ను అమ్మ నాన్న ఫిర్యాదుపై ఆర్డీవో రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ అమెరికాలోని రోహిత్ శౌర్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 3, 4, 5, 6 అంతస్తులను పిటిషనర్, అతని సోదరుడికి తాత సుబ్బారావు కానుకగా గిఫ్ట్‌డీడ్ ఇచ్చారన్నారు. అయితే సీనియర్ సిటిజన్స్ చట్టం కింద గిఫ్ట్‌ రద్దుకు ఆర్డీవో ఆదేశాలు జారీ చేశారని, అమెరికాలోని పిటిషనర్లకు నోటీసులు ఇవ్వలేదన్నారు. ప్రతివాది, సుబ్బారావు కుమారుడు కౌంటరు దాఖలు చేస్తూ తన తండ్రి చనిపోయారని, నలుగురు పిల్లలు ఉన్నారని, తండ్రి ఆస్తి పిల్లలకు చెందుతుందన్నారు. ఆ విషయం అతనికి తెలిసినా ఉద్దేశపూర్వకంగా వారసుల్ని ప్రతివాదులుగా చేయకుండా, అదీ 9 నెలల తరువాత తమ సోదరి కుమారులు పిటిషన్ వేయడం చెల్లదన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి సీనియర్ సిటిజన్స్ చట్టం కింద గిఫ్ట్‌ను రద్దు చేయాలనుకుంటే అందులో షరతులను ఉల్లంఘించి ఉండాలన్నారు.

ఆర్డీఓ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పు : ప్రస్తుత కేసులో తాత కుమారుడు కొడుకులైన ఇద్దరు మనుమలకు ప్రేమ, వాత్సల్యంతో ప్లాట్లను గిఫ్ట్‌డీడ్ రిజిస్టర్ చేసి ఇచ్చారన్నారు. వ్యక్తిగత అవసరాలను చూసుకోవాలంటూ ఎలాంటి బాధ్యతను వారిపై మోపలేదన్నారు. అల్లుడితో విభేదాల కారణంగా సీనియర్ సిటిజన్స్ చట్టం కింద ఆర్డీఓ వద్ద ఫిర్యాదు దాఖలు చేశారని, అయితే షరతులేని గిఫ్ట్‌ను సీనియర్ సిటిజన్స్ చట్టం కింద రద్దు చేయడానికి వీల్లేదన్నారు. ఆర్టీవో 2023 జనవరి 12న ఉత్తర్వులు జారీ చేసిన తరువాత గిఫ్ట్ ఇచ్చిన తాత సుబ్బారావు అదే ఏడాది అక్టోబరు 20న మృతి చెందారన్నారు. అందువల్ల గిఫ్ట్‌పై తండ్రి తరపున వారసులైన కొడుకులు వివాదం చేయడానికి హక్కు లేదన్నారు. తండ్రి ఇచ్చిన గిఫ్ట్‌పై వారసులకు ఏమైనా వివాదాలుంటే వాటిని సివిల్ కోర్టులో తేల్చుకోవాలన్నారు. కుమార్తె పిల్లలకు తాత షరతుల్లేకుండా చేసి ఇచ్చిన షరతులేని గిఫ్ట్ డీడ్‌లు రద్దు చేసే అధికారం ఆర్డీవోకు లేదంటూ, ఆర్డీఓ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు.

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు: సుప్రీంకోర్టు తీర్పు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.