Obulapuram Mining Case Inquiry PostPoned : ఓబుళాపురం మైనింగ్ కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దోషులు గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. సీబీఐ కోర్టు తీర్పు యాంత్రికంగా ఉందని అందులో పేర్కొన్నారు. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిందని కోర్టుకు తెలిపారు.
కేసు విచారణ సందర్భంలో గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మూడున్నరేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించినట్లు వారి తరఫు న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. నేరాలకు పాల్పడినందుకే సీబీఐ కోర్టు శిక్ష వేసిందని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
ఒకే కేసు - ఒకే రోజు - తెలంగాణ హైకోర్టు చరిత్రలో తొలిసారి ఇలా
ఓబుళాపురం మైనింగ్ కేసు - గాలి జనార్దన్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలింపు