ETV Bharat / state

తెలంగాణలో ఏఐ సృజనాత్మక కేంద్రం - మూడేళ్లలో 10వేలకు పైగా ఉద్యోగావకాశాలు

తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్‌ హబ్ ఏర్పాటు ప్రభుత్వం నిర్ణయం - ​ మూడేళ్లలో 50 వేల మందికి పైగా నైపుణ్య శిక్షణ - 10 వేలకుపైగా ఉద్యోగావకాశాలు - ఏఐ యూనివర్సిటీ కూడా ఏర్పాటు

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 14, 2025 at 9:27 AM IST

3 Min Read
Choose ETV Bharat

Govt Steps To Make Telangana Capital Of AI : అంతర్జాతీయంగా కృత్రిమ మేధ రాజధానిగా తెలంగాణను తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఏఐ పరిశోధన, ఆవిష్కరణలు, అభివృద్ధి, వాణిజ్యంలో రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో ‘తెలంగాణ ఏఐ సృజనాత్మక కేంద్రం’ (తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్‌ హబ్‌-టీఏఐహెచ్‌) స్థాపించాలని సర్కార్​ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఏఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఉంది. ఏఐ ఇన్నోవేషన్, ఏఐ స్టార్టప్స్‌ ఇలా వేర్వేరు గ్రూపులుగా పనిచేస్తున్నాయి. హబ్‌ ద్వారా వీటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురాలని యోచిస్తున్నారు. ఇందులో ఏఐ యూనివర్సిటీ కూడా నెలకొల్పనున్నారు. దీని ద్వారా మూడేళ్లలో 50 వేల మందికి పైగా తెలంగాణ యువతకు స్కిల్​ ట్రైనింగ్​ ఇవ్వాలని, 10 వేల మందికి పైగా ఉద్యోగావకాశాలు కల్పించాలన్నది లక్ష్యం.

అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలు, పేటెంట్లు కల్పించడం ద్వారా రాష్ట్రానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు లభిస్తుందని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో అధికారులు తెలిపారు. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో హబ్‌ ఏర్పాటుపై పీపీటీ రూపొందించి, సీఎంకు చూపించారు. దీంతో హబ్‌ స్థాపనకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ మేరకు ఐటీ, పరిశ్రమల శాఖ దృష్టి సారించింది. ఫ్యూచర్‌ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీ ప్రారంభించేందుకు సర్కార్​ నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకు సమయం పట్టనుండటంతో తాత్కాలికంగా ఒక బహుళ అంతస్తుల భవనంలో ‘ఏఐ ఇన్నోవేషన్‌ హబ్‌’ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Govt Steps To Make Telangana Capital Of AI
Govt Steps To Make Telangana Capital Of AI (Eenadu)

ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు : రాష్ట్రంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ద్వారా ‘తెలంగాణ ఏఐ మిషన్‌’ 270కి పైగా ఏఐ స్టార్టప్‌లకు మద్దతు ఇస్తోంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(డీఎస్‌టీ), టీ-హబ్‌ కలిసి సంయుక్తంగా 80 స్టార్టప్‌లకు సహాయం చేస్తున్నాయి. కొత్తగా ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ల స్థాపనకు పరిశ్రమలు చేసిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఏఐ సదస్సు సందర్భంగా కిండ్రిల్, యోట్టా, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ఐఐఐటీ, బిట్స్, వాధ్వానీ ఫౌండేషన్, జికా వంటి సంస్థలు కూడా ప్రభుత్వంతో ఏఐకి సంబంధించి ఎంఓయూలు ఒప్పందం చేసుకున్నాయి. ఇవన్నీ వేర్వేరు గ్రూపులుగా పనిచేస్తుండడం వల్ల ఆశించిన ఫలితాలు వేగంగా రావడం లేదని, గ్లోబల్‌ ఏఐ హబ్‌గా ఆశించిన స్థానానికి చేరుకోవడంలో ఆలస్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఒకే సంస్థ కింద అన్ని ఏఐ కార్యక్రమాలను చేర్చేందుకు ‘తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్‌ హబ్‌’ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది పరిశ్రమలతో సమన్వయం చేసుకుంటూ స్వతంత్ర ప్రతిపత్తి సంస్థగా కొనసాగుతుంది. గ్లోబల్‌ కంపెనీలు, పరిశోధన సంస్థలు, ఇతర ఏఐ హబ్‌లతో భాగస్వామ్యాలను ఏర్పాటు చేస్తుంది.

ఈ హబ్‌లో ప్రపంచస్థాయి నాయకత్వ బృందాన్ని నియమించనున్నారు. గ్లోబల్‌ సీఈఓను నియమిస్తారు. సిలికాన్‌ వ్యాలీకి చెందిన ప్రసిద్ధ నాయకులు సహా అంతర్జాతీయ స్థాయి నిపుణులతో ఒక గవర్నెన్స్‌ బోర్డు ఉంటుంది. మూడు సంవత్సరాల్లో 80-90 మంది కోర్‌ స్టాఫ్‌ నియామకం కోసం ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయిస్తుంది. సిలికాన్‌ వ్యాలీలా ప్రపంచస్థాయి నైపుణ్యాన్ని తీసుకొచ్చి స్టార్టప్‌ల విజయంలో భాగస్వామ్యం అయ్యేలా యత్నిస్తారు. ‘తెలంగాణ ఏఐ హబ్‌’ గ్లోబల్‌ బ్రాండ్‌గా మారడం వల్ల పెద్ద కంపెనీలు, పెట్టుబడులను ఆకర్షించడానికి మార్గం సులభమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Govt Steps To Make Telangana Capital Of AI
Govt Steps To Make Telangana Capital Of AI (Eenadu)

ఎగ్జిక్యూటివ్‌ బ్రీఫింగ్‌ సెంటర్‌ నమూనా : 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో హబ్‌ ప్రధాన కేంద్రంతో పాటు ఎగ్జిక్యూటివ్‌ బ్రీఫింగ్‌ సెంటర్, ఏఐ స్టార్టప్‌ స్పేస్‌.వీసీ కారిడర్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌లు.. ట్రైనింగ్‌ సెంటర్లు తదితరాలుంటాయి. ఇక్కడ స్టార్టప్‌లకు స్థలం, పరిశోధకులకు ల్యాబ్‌లు, శిక్షణ కేంద్రాలు ఉంటాయి. స్టాక్‌ హోల్డర్ల కోసం డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ రూపొందించనున్నారు.

మొదటి మూడేళ్లలో నాయకత్వం, మార్కెటింగ్, కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెడతారు. ఆ తర్వాత మూడేళ్లలో ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధిగా ఎదగాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

  • 250కి పైగా ఏఐ స్టార్టప్‌ల ప్రారంభం
  • 50కి పైగా గ్లోబల్‌ పేటెంట్లు సాధించేలా ప్రోత్సహం
  • 100 మిలియన్‌ డాలర్లకిపైగా ప్రైవేటు ఫండింగ్‌ను ఆకర్షించడం
  • 15కి పైగా బహుళజాతి సంస్థల పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను స్థాపించేలా ప్రోత్సహించడం
  • 25కి పైగా అంతర్జాతీయ వర్సిటీలు, పరిశోధన ల్యాబ్‌లతో భాగస్వామ్యాలు

పెళ్లి సంబంధాలు వెతకడంలో సాయపడుతున్న 'ఏఐ' - చిటికెలో సమాచారం మీ వద్దకు

ట్రాఫిక్​లో ఏఐ కెమెరాలు - కంట పడితే అంతే, తప్పించుకునే అవకాశమే లేదు