Telangana Govt on New Ration Card : కొత్త రేషన్ కార్డులను స్మార్ట్ కార్డుల రూపంలో ఇచ్చేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది. ప్రతి స్మార్ట్ రేషన్ కార్డుకు ఓ క్యూఆర్ కోడ్ పెట్టాలని నిర్ణయించింది. స్మార్ట్ కార్డు ఎలా ఉండాలన్న విషయంలై వివిధ రకాల డిజైన్లను పరిశీలిస్తోంది. ఈ డిజైన్ల ప్రక్రియ కొద్దిరోజుల్లో కొలిక్కి రానున్నట్లు సమాచారం.
ప్రక్రియ ఆలస్యం : రాష్ట్రంలో దాదాపు 90 లక్షల కుటుంబాలకు రేషన్‌కార్డులున్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారిలోనూ అర్హులైన వారికి రేషన్‌కార్డులు మంజూరు చేయాలి. ఆయా జిల్లాల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయింది. నిజానికి ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో మార్చి 1 నుంచి మిగతా జిల్లాల్లో మార్చి 8వ తేదీ తర్వాత కొత్త రేషన్‌కార్డులు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. స్మార్ట్ కార్డు రూపంలో రేషన్‌కార్డులు ఇవ్వనున్న నేపథ్యంలో జారీ ప్రక్రియ ఆలస్యం కానున్నట్లు తెలిసింది. కొత్త వారితో పాటు ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నవారికి సైతం స్మార్ట్ రేషన్‌కార్డులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ టెండర్లు పిలిచింది.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే కుటుంబం వివరాలు : బిడ్ల దాఖలకు మార్చి 25న తేదీ వరకు గడువు ఇచ్చింది. ప్రీబిడ్ సమావేశాన్ని మార్చి 17న నిర్వహిస్తామని తెలిపింది. కుటుంబ యజమానిగా మహిళల పేరుతోనే రేషన్‌కార్డులు ఉన్నాయి. స్మార్ట్ రేషన్‌కార్డులను మహిళలో ఫొటోతోనే జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. రేషన్ షాపునకు వెళ్లి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే ఆ కుటుంబంలో రేషన్ అర్హుల వివరాలన్నీ వస్తాయని సమాచారం. ఈ విధానానికి సంబంధించి తెలంగాణ ఉన్నతాధికారుల బృందం రాజస్థాన్, కర్ణాటక, హరియాణా, గుజరాత్ రాష్ట్రాల్లో గతేడాది అధ్యాయనం చేసింది.
అక్కడ పేర్లు తొలగించుకుంటేనే ఇక్కడ కొత్త కార్డులు - ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సవుతున్నారు!
గుడ్ న్యూస్ - కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ - ఒకే రోజున లక్ష కార్డులు!