ETV Bharat / state

గ్రేటర్​లో అండర్​ గ్రౌండ్ విద్యుత్​ కేబుళ్లు! - వర్షం పడినా కరెంట్ మాత్రం పోదు!! - UNDER CABLE CONNECTION IN HYD

గ్రేటర్‌ పరిధిలో భూగర్భంలో కరెంట్‌ వైర్ల ఏర్పాటుకు చర్యలు - విపత్కర పరిస్థితుల్లోనూ విద్యుత్‌ సరఫరా చేయాలని ప్రణాళిక - ఒక్కో సెక్షన్​కు రూ.100 కోట్లు కేటాయించాలని నిర్ణయం

Under Cable Connection in Hyderabad
Under Cable Connection in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 9, 2025 at 9:42 AM IST

Updated : June 9, 2025 at 9:50 AM IST

3 Min Read

Under Cable Connection in Hyderabad : హైదరాబాద్‌లో భారీ వర్షం, గాలి దుమారం వస్తే చాలు, ఇక ఆ సమయంలో కరెంట్ కోతలే! ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా గ్రేటర్ హైదరాబాద్ విద్యుత్ సంస్థ ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, నిరంతర కరెంట్ సరఫరా చేసేందుకు పక్కా ప్రణాళికతో అధికారులు ముందుకెళ్తున్నారు. గ్రేటర్​లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంతకీ అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుళ్ల ఏర్పాటుకు ఎంత ఖర్చు అవుతుంది? అవి అందుబాటులోకి వస్తే ఎలాంటి ప్రయోజనాలు చేకూరనున్నాయి.

రూ.22 వేల కోట్ల నిధులు అవసరం : హైదరాబాద్​ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా రహదారులు, వీధుల్లో వేలాడుతున్న ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లను తొలగించి, వాటి స్థానంలో భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని ఎస్పీడీసీఎల్​ యాజమాన్యం నిర్ణయించింది. అందుకోసం సబ్‌స్టేషన్లలోని ఫీడర్ల వారీగా వివరాలను సేకరిస్తోంది. ఈ ప్రక్రియ ఇప్పటికే దాదాపు కొలిక్కి వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. ఒక్కో సెక్షన్​కు రూ.100 కోట్ల చొప్పున నిధులు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని సెక్షన్లకు కలిపి రూ.22 వేల కోట్లకు పైగా నిధుల అవసరం ఉంటుందని విద్యుత్ అధికారులు ప్రాథమికంగా అంచనాలు రూపొందిస్తున్నారు.

గ్రేటర్​లో అండర్​ గ్రౌండ్ విద్యుత్​ కేబుళ్లు! - వర్షం పడినా కరెంట్ మాత్రం పోదు!! (ETV Bharat)

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో గాలి దుమారం, వర్షాలు వస్తే ఆ సమయంలో విద్యుత్ సరఫరాలో కలిగే ఇబ్బందులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఎదుర్కొనే సమస్యలపై అధికారులు ఇప్పటికే సమగ్ర నివేదిక తయారు చేశారు. భూగర్బ కేబుళ్లను ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఖర్చులపై అధ్యయనం కొనసాగిస్తున్నారు. ఎక్కడెక్కడ భూగర్భ కేబుళ్లను ఏర్పాటు చేయాలనే దానిపై ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు వచ్చారు. మెట్రో జోన్ పరిధిలోని హైదరాబాద్ సెంట్రల్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ సర్కిళ్లలో డిస్ట్రిబ్యూషన్ లైన్లు మినహా 33 బై 11 కేవీ లైన్ల పనులు దాదాపు పూర్తయ్యాయి.

కరెంటు తీగలు కనిపించని నగరంగా : మేడ్చల్ పరిధిలోని హబ్సిగూడ, మేడ్చల్ సర్కిల్, రంగారెడ్డి పరిధిలోని సైబర్ సిటీ, రాజేంద్రనగర్, సరూర్​నగర్ జోన్ల పరిధిలోని కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇప్పటికీ ఓవర్ హెడ్ ​లైన్లు ఉన్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షానికి తరచూ అవి తెగిపడుతూ, ఆ దారిలో వచ్చి వెళ్లేవారిపై మృత్యు ఘంటికలుగా మారుతున్నాయ్. ప్రమాదాలను నియంత్రించడంతో పాటు వేలాడే కరెంట్ తీగలు కనిపించని నగరంగా తీర్చిదిద్దాలని ఎస్పీడీసీఎల్ సంస్థ నిర్ణయించింది. ఆ మేరకు నగరమంతా భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని చూస్తోంది.

ఇటీవలే రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, ట్రాన్స్ కో సీఎండీ నేతృత్వంలోని ఇంజినీర్ల బృందం బెంగళూరులో పర్యటించారు. అక్కడ భూగర్భ విద్యుత్ కేబుల్ పనులను ఈ బృందం పరిశీలించింది. అక్కడి అధికారులతో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అధికారులు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పలు అంశాలపై ఆరా : భూగర్బ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ఏ మేరకు ఖర్చు అవుతుంది, ఒకవేళ ఏదైనా విద్యుత్ అంతరాయాలు కలిగితే వాటిని ఏ విధంగా గుర్తిస్తారు. తిరిగి కొంత సమయంలోనే విద్యుత్ సరఫరా ఏవిధంగా పునరుద్దరిస్తారు? తదితర అంశాలపై అధికారులు ఆరా తీశారు. అనంతరం హైదరాబాద్​కు వచ్చిన తర్వాత ఎన్ని కిలోమీటర్ల మేర భూగర్భ కేబుళ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది? ఎంత ఖర్చు అవుతుంది? తదితర వాటిపై సెక్షన్ల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో మెట్రో అధికారులు ప్రాజెక్ట్ విభాగం సమగ్ర నివేదికను సిద్ధం చేశారు. అనంతరం ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలుస్తోంది.

స్తంభాల నుంచి విద్యుత్​ వాడుతున్నారా? - అయితే పక్కా పన్ను చెల్లించాల్సిందే!

ఆసుపత్రుల్లో కరెంట్ లేకుంటే ఎలా? - అధికారులతో మంత్రి దామోదర రివ్యూ

Last Updated : June 9, 2025 at 9:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.