ETV Bharat / state

రాష్ట్రంలో మారనున్న రోడ్ల రూపురేఖలు - 95 నియోజకవర్గాల్లో రహదారులకు మహర్దశ - HYBRID ANNUITY MODEL

హ్యామ్‌ విధానంలో చేపట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం - ఆర్‌ఆర్‌ఆర్‌ అవతల 95 నియోజకవర్గాలకు లబ్ధి - ప్రాజెక్టుకు నేడు ఆమోదం తెలపనున్న మంత్రిమండలి

Telangana Roads Development
Telangana Roads Development (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 5, 2025 at 7:39 AM IST

Updated : June 5, 2025 at 9:29 AM IST

2 Min Read

Telangana Roads Development : రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం హైబ్రిడ్​ యాన్యూటీ మోడల్​ (హ్యామ్)​ పద్ధతిని తీసుకొచ్చింది. హ్యామ్​ విధానంలో 60 శాతం నిధులను గుత్తేదారు సంస్థలే తొలుత ఖర్చు చేస్తాయి. ప్రభుత్వం ఆ సొమ్మును 15 సంవత్సరాల్లో ఏడాదికోసారి చొప్పున వాయిదాల పద్ధతిలో చెల్లిస్తుంది. ప్రభుత్వం వెచ్చించాల్సిన మిగిలిన 40 శాతం నిధులు కూడా దశలవారీగా విడుదల చేసే అవకాశం ఉంది. పెద్దగా ఆర్థిక భారం లేకుండానే రహదారుల అభివృద్ధి చేయవచ్చన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని ఎంచుకున్నారు.

మహారాష్ట్రలో విజయవంతమైన హ్యామ్‌ విధానం అమలు తీరును రాష్ట్ర అధికార ప్రతినిధి బృందం అక్కడికి వెళ్లి పరిశీలించి వచ్చింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. మంత్రిమండలి ఆమోదం రాగానే వెంటనే టెండర్లు పిలిచేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. హ్యామ్​ విధానంలో సుమారు 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని రహదారులు మెరుగుపడనున్నాయి. రాబోయే మూడేళ్లలో 36 వేల కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పనులను మొత్తం మూడు దశల్లో చేపట్టాలని నిర్ణయించింది. మొదటి దశలో రోడ్లు, భవనాల శాఖకు చెందిన 5,190 కిలోమీటర్లు, అలాగే పంచాయతీరాజ్​ శాఖకు చెందిన 8000 కిలోమీటర్లు మొత్తంగా రూ.22 వేల కోట్లతో 13,190 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. మరోవైపు మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు ఉన్న ఒక్క వరుస రోడ్లను రెండు వరుసలుగా మార్చనున్నారు.

మన రహదారులకు మహర్దశ - మారనున్న గ్రామీణ, పట్టణ రోడ్ల రూపురేఖలు (ETV Bharat)

జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్​కు నాలుగు వరుసలు : అలాగే జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్​కు రెండు వరుసలుగా ఉన్న రోడ్లను నాలుగు వరుసలకు విస్తరించనున్నారు. మరోవైపు గ్రామీణ ప్రధాన రహదారులనూ ఉన్నతీకరిస్తారు. కన్సల్టెంట్​ ప్రాజెక్టు ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన యాప్​లో అభివృద్ధి చేయబోయే రహదారులను సైతం గుర్తించారు. తొలి దశలో చేపట్టే హ్యామ్​ రోడ్ల నిర్మాణానికి 6000 ఎకరాలకు పైగా భూసేకరణ చేయాలనే అంచనాలు తెరపైకి వచ్చాయి.

హ్యామ్​ రోడ్ల నిర్మాణానికి జాతీయ రహదారుల నిబంధనలే : ఈ హ్యామ్​ రోడ్ల నిర్మాణానికి జాతీయ రహదారుల నిబంధనలే వర్తిస్తాయి. కేంద్రం పలు ప్రాజెక్టులను హ్యామ్​ పద్ధతిలోనే చేపట్టగా, ఖర్చు చేసిన నిధులను గుత్తేదారు సంస్థలు టోల్​ప్లాజా ద్వారా వసూలు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. ఇక్కడ రాష్ట్రంలో చేపట్టే హ్యామ్​ రహదారులకు మాత్రం టోల్​ట్యాక్స్​ అనేది ఉండదు. 15 ఏళ్లకు సంబంధించిన ఆ రోడ్ల నిర్వహణ బాధ్యతను సదరు గుత్తేదారు సంస్థనే చూసుకోవాల్సి ఉంటుంది.

తొలి దశలో హ్యామ్​ పద్ధతిలో రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టే 5,190 కిలోమీటర్ల పనులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయన కేబినెట్​ ఆమోదానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయగా, అనంతరం రాబోయే రోజుల్లో రహదారులకు మహర్దశ పట్టబోతుందని మంత్రి కోమటిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

3 దశల్లో హ్యామ్​ రోడ్ల నిర్మాణం - 12 వేల కి.మీ. అభివృద్ధికి సన్నాహాలు

రాష్ట్రంలో రూ.1000 కోట్లతో 'హ్యామ్' పద్ధతిలో రోడ్ల అభివృద్ధి!

Last Updated : June 5, 2025 at 9:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.