Postal Financial Services For SHGs : మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీల కోసం తపాలా శాఖ సేవలను ఉపయోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానాన్ని జులై నుంచి అమలు చేసేందుకు శాఖ సన్నాహాలు చేస్తోంది. తపాలాశాఖ సేవలను వినియోగించుకోవడం వల్ల స్వయం సహాయక సంఘాల లోన్ తిరిగి చెల్లింపులు సులభతరమవుతాయని భావిస్తోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని పది గ్రామాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయగా విజయవంతమైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో తపాలా కార్యాలయాల ద్వారానే ఈ సేవలను కొనసాగించాలని నిర్ణయించింది.
ప్రస్తుతం మహిళా సంఘాలు బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటూ వాటి ద్వారానే తిరిగి చెల్లిస్తున్నాయి. గ్రామాల్లో బ్యాంకులు తక్కువగా ఉండటంతో చెల్లింపులు సమస్యగా మారాయి. బ్యాంకులు ఉన్న ప్రాంతాలకు వెళ్లి రావడం సభ్యులకు ఇబ్బందికరంగా మారడంతో పాటు చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. కొంతమంది సభ్యులు చెల్లింపులు చేయడం లేదు. ఫలితంగా కొన్ని సంఘాలు మొండి బకాయిల జాబితాలో చేరుతున్నారు.
ఆర్థిక ప్రోత్సహకాలకు : ఆయా సంఘాల సభ్యులు ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రోత్సాహకాలకు దూరమవుతున్నారు. దీంతో అన్ని గ్రామాల్లో అందుబాటులో ఉన్న తపాలా కార్యాలయాల సేవలను అందుబాటులోకి శాఖ ఏర్పాట్లు చేస్తోంది. స్త్రీనిధి యాప్ ద్వారా ఈ సేవలను కొనసాగించనున్నారు. రుణాలను తిరిగి చెల్లించేలా యాప్‌ను మహిళా సంఘాల సభ్యుల ఖాతాలతో అనుసంధానం చేయడం ద్వారా సులభంగా చెల్లింపులు జరిగే అవకాశం ఉంటుంది.
మహిళా శక్తి ఓ బ్రాండ్ కావాలి : మంత్రి సీతక్క - Mahila Shakti programme
మీ ఇంటిపై సోలార్ ప్లాంట్ పెట్టుకునేందుకు ప్రభుత్వ సహకారం - ఇలా అప్లై చేసుకోండి!