ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలల్లో చదివించే వారికే ప్రభుత్వ ఉద్యోగం - చర్చించాలన్న సీఎం రేవంత్ రెడ్డి - REVANTH REDDY ON EDUCATION SYSTEM

ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారిని ప్రోత్సహించేలా చర్యలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి - శాసన మండలిలో విద్యాశాఖపై ప్రసంగం

Telangana CM Revanth Reddy on Education System in Council Sessions
Telangana CM Revanth Reddy on Education System in Council Sessions (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 26, 2025 at 10:38 PM IST

2 Min Read

Telangana CM Revanth Reddy on Education System in Council Sessions : ప్రతిస్థాయిలో విద్యా రంగం రోజు రోజుకూ క్షీణించిపోతోందని సీఎం రేవంత్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారిని ప్రోత్సహించేలా చర్యలు ఉండాలని అన్నారు. శాసన మండలిలో విద్యాశాఖపై సీఎం మాట్లాడారు. ఈ తరుణంలో సభలో ఆసక్తికర సన్నివేశం జరిగింది.

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని సూచించారని సీఎం తెలిపారు. ఈ విషయంపై చర్చించాలని సీఎం అన్నారు. చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కలగ చేసుకొని ప్రభుత్వ ఉపాధ్యాయులు పిల్లులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలనే నిబంధన తీసుకురావాలని అనగా దానికి సీఎం సమాధానం చెప్తూ ఆ మాట అనే ధైర్యం తనకు లేదని అన్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించే వారికే ప్రభుత్వ ఉద్యోగంపై చర్చిస్తే బాగుంటుందని సూచించారు.

సమాజం కూడా బాధ్యత తీసుకోవాలి : 2021లో 3, 5 తరగతుల విద్యార్థులపై నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే జరిగిందని, ఈ సర్వే ప్రకారం 75 % మంది విద్యార్థులు కనీస సామర్థ్యాలు చూపట్లేదని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ ర్యాంకు చివరి నుంచి ఐదో స్థానంలో ఉందని, 3వ తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ పరిజ్ఞానంలో తెలంగాణ 36వ స్థానంలో ఉందని తెలిపారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అథమ స్థానంలో ఉందని, ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి విద్యార్థులు రెండో తరగతి పుస్తకాలు చదవలేని పరిస్థితి అని, ప్రతి స్థాయిలో విద్యారంగం రోజు రోజుకూ క్షీణించి పోతోందని, ప్రభుత్వమే కాదు. సమాజం కూడా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

విద్యా కమిషన్‌ ఏర్పాటు చేశాం : కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత 11000 పైగా టీచర్ల నియామకం చేపట్టామని, 21000 మందికి పైగా టీచర్లకు పదోన్నతులు కల్పించామని, ఏడెనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 36000 మంది టీచర్ల బదిలీ చేపట్టామని తెలిపారు. కలెక్టర్లనైనా బదిలీ చేయవచ్చు గానీ, టీచర్ల బదిలీ ఆషామాషీ కాదని అన్నారు. 36000 మంది టీచర్లను చిన్న ఆరోపణలు లేకుండా బదిలీ చేశామని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులపై రూ.1.08లక్షలు చొప్పున ఖర్చు చేస్తున్నామని, ప్రైవేటులో రూ.50వేల వరకు ఖర్చయితే ప్రభుత్వ పాఠశాలల్లో రూ.లక్ష ఖర్చవుతోందని పేర్కొన్నారు.

బడ్జెట్‌లో విద్యకు ప్రాధాన్యమిస్తూ రూ.23,108 కోట్లు కేటాయించామని, విద్యా రంగానికి భారీగా నిధులు కేటాయించినా ప్రమాణాలు పడిపోతున్నాయని, ఇందుకు ప్రభుత్వమే కాదు. సమాజం బాధ్యత తీసుకోవాలని సూచించారు. లోతుగా విశ్లేషించి సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, రాజకీయ కోణంలో ఆలోచన చేసినంత కాలం విద్యారంగం ప్రక్షాళన కాదని, విద్య పట్ల ప్రత్యేక విధానం తీసుకురావాలనేది ప్రభుత్వ ఉద్దేశమని, విద్యారంగం బలోపేతానికి సూచనల కోసం విద్యా కమిషన్‌ ఏర్పాటు చేశామని వివరించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారిని ప్రోత్సహించేలా చర్యలు ఉండాలి. స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని సూచించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తేనే స్థానిక సంస్థల్లో పోటీకి అవకాశంపై చర్చించాలి. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించే వారికే ప్రభుత్వ ఉద్యోగంపై చర్చించాలి. రేవంత్ రెడ్డి, సీఎం

ఆన్‌లైన్‌ బెట్టింగ్, రమ్మీని నిషేధించడానికి సిట్‌ : సీఎం రేవంత్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.