New Ration Cards Apply : మీసేవ ద్వారా రేషన్‌కార్డుల దరఖాస్తులపై పౌరసరఫరాల శాఖ స్పష్టత ఇచ్చింది. రేషన్‌కార్డులకు మీసేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించట్లేదని చెప్పింది. మీసేవ ద్వారా దరఖాస్తులపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని తేల్చి చెప్పింది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేయిస్తున్నామని వెల్లడించింది. దరఖాస్తులు ఆన్లైన్ చేయాలని మీసేవను కోరామంది. మార్పులు, చేర్పులకు మీసేవ ద్వారా దరఖాస్తులు అందుతున్నాయని పౌరసరఫరాల శాఖ వెల్లడించింది.
ఇవాళ ఉదయం నుంచి ప్రజలు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసేందుకు ప్రయత్నించగా, అక్కడ దరఖాస్తులు స్వీకరించకపోవడంతో గందరగోళం తలెత్తింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఎన్నికల కమిషన్ నిలిపివేసిందని ప్రచారం జోరుగా సాగింది. కానీ ఎన్నికల కమిషన్ నిలిపివేయలేదని, పౌరసరఫరాల శాఖ కానీ మీసేవ కానీ తమను సంప్రదించలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించడం లేదని పౌరసరఫరాల శాఖ తెలిపింది. మార్పులు, చేర్పుల కోసం మీ సేవ ద్వారా ఇప్పటికే దరఖాస్తులు అందుతున్నాయని చౌహాన్ తెలిపారు.
కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే వారికి గుడ్‌న్యూస్ - మీ సేవ కేంద్రాల్లోనూ
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీలో కొర్రీలు! - మీకు ఇవి ఉంటే దరఖాస్తు తిరస్కరణ!