ETV Bharat / state

దసరాకు హెవీ అయిందా? ఐతే ఈసారి ఈ తెలంగాణ చారు ట్రై చేయండి

రుచుల్లోనే కాదు హెల్త్​ కాపాడటంలోనూ ఈ చారు లెక్కే వేరు - ఒక్కసారి రుచి చూస్తే ఆహా అనాల్సిందే!

Telangana Charu Recipe For Good Health
Telangana Charu Recipe For Good Health (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 14, 2024, 10:50 PM IST

Telangana Charu Recipe : తెలంగాణ చారు అంటే కేవలం ఒక ఆహారం మాత్రమే కాదు, అది మన సంస్కృతి, ఆచారాలకు అద్దం. పల్లెటూర్ల నుంచి నగరాల వరకు ప్రతి ఇంటిలోనూ తయారయ్యే ఈ చారు, రుచికి కమ్మగా ఉండటమే కాదు, అటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కారంకారంగా, ఘాటుఘాటుగా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఇక మాటల్లేవు.. చిన్నా, పెద్దా అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా జలుబు, జ్వరం, దగ్గుతో నోటికి రుచి తెలియని వారికి సైతం అమృతంలా పనిచేస్తుంది. మొత్తంగా ఈ దసరా పండుగలో ఫుడ్​ పరంగా కాస్త అజీర్తి, ఇతరత్రా ఇబ్బందులు తలెత్తినా ఈ చారు టేస్ట్​ చేస్తే చాలు, కాస్త ఉపశమనం పొందేందుకు దోహదం పడుతుంది.

తెలంగాణ చారు తయారీకి కావలసిన పదార్థాలు :

  • టమాటాలు - 2
  • పచ్చిమిరపకాయలు - 3
  • మిరియాలు
  • ఉల్లిపాయ - 2
  • తగినంత ఉప్పు
  • కారం - అర టీస్పూన్
  • ఆవాలు
  • జీలకర్ర
  • వెల్లుల్లి
  • కొత్తిమీర
  • గరం మసాలా
  • నూనె - 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం :

  1. పదార్థాలను తయారు చేసుకోవడం : టమాటాలు, ఉల్లిపాయలను ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలను మిక్సీలో చేర్చి పేస్ట్ రెడీ చేసుకోవాలి. కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా తరిగి సిద్ధం చేసుకోవాలి.
  2. ముందుగా వంట నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేయాలి.
  3. మిరియాల పేస్ట్‌ను బాగా కలపాలి . తరువాత కోసిన టమాటాలు, ఉల్లిపాయలు వేసి మెత్తగా ఉడకనివ్వండి.
  4. సరిపడినంత నీరు చేర్చి మరిగించాలి. నీరు మరిగాక ఉప్పు, కారం, గరం మసాలా వేసి కలపాలి.
  5. చారు కాస్త గాఢంగా వచ్చే వరకు మరిగించాలి.
  6. చివరగా కొత్తిమీరను చల్లుకొని దించుకోవాలి. అంతే మీకు కావాల్సిన చారు రెడీ అయింది.

చిట్కాలు :

  • చారులో కొద్దిగా చింతపండు రసం వేస్తే మరింత రుచిగా ఉంటుంది.
  • పచ్చిమిరపకాయల మొత్తాన్ని మీరు ఇష్టం మేరకు తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు.

Note : ఈ విధానం ఒక ఉదాహరణ మాత్రమే. మీరు మీ ఇష్టం మేరకు ఇతర పదార్థాలను కూడా చేర్చి చారు ప్రిపేర్​ చేయవచ్చు.

వర్షాకాలంలో జలుబు, దగ్గు వేధిస్తుంటే - ఘాటుగా అల్లం చారు చేసుకోండి! - వెంటనే క్లియర్​ అయిపోతుంది! - Allam Charu Making Process

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.