ETV Bharat / state

మెట్రో విస్తరణ దిశగా మరో అడుగు - మూడు మార్గాల డీపీఆర్​లకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం - HYDERABAD METRO RAIL EXPANSION

మెట్రో రెండో దశ బి- భాగానికి సంబంధించిన డీపీఆర్​లకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం - మూడు మార్గాల డీపీఆర్​లు కేంద్రానికి పంపేందుకు సర్వం సిద్ధం - మూడు మార్గాలు కలిపి 86.1 కిలోమీటర్ల పొడవు

Hyderabad Metro Latest Update
Hyderabad Metro Latest Update (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 7, 2025 at 7:24 AM IST

3 Min Read

Hyderabad Metro Rail Latest Update : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో విస్తరణకు మరో అడుగు పడింది. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో రైలు లిమిటెడ్‌ (HAML) మూడు మార్గాల డీపీఆర్‌లను వేర్వేరుగా రూపొందించింది. ఈ డీపీఆర్​లకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం లభించడంతో వెంటనే కేంద్రానికి పంపాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. మెట్రో రెండో దశ బి-భాగంలోని మూడు మార్గాలు కలిపి 86.1 కిలో మీటర్ల పొడవున 2030 నాటికి పూర్తయితే, ప్రతిరోజూ 6.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని డీపీఆర్​లో పేర్కొన్నారు.

డీపీఆర్​లోని అంశాలు :

కారిడార్​-9 :

  • కారిడార్‌-9లో శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్‌ సిటీ వరకు 39.6 కిలో మీటర్ల మార్గంలో తొమ్మిది స్టేషన్లు ప్రతిపాదించారు.
  • విమానాశ్రయం నుంచి మాన్‌సాన్‌పల్లి రోడ్, ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రహదారి వెంట పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల ఎగ్జిట్‌ వరకు మెట్రో మార్గం వెళ్తుంది.
  • రావిర్యాల నుంచి ప్యూచర్‌సిటీ వరకు ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి మధ్యలోంచి భూమార్గంలో 17.1 కిలో మీటర్లు ఉంటుంది.
  • ఈ మార్గంలో ఆర్​జీఐఏ, పెద్ద గోల్కొండ, బహదూర్‌గూడ, తుక్కుగూడ, రావిర్యాల, కొంగరకలాన్, రాచలూరు, గుమ్మడవెల్లి, స్కిల్స్‌ యూనివర్సిటీ ప్రాంతాల్లో స్టేషన్లను ప్రతిపాదించారు.
  • ఎయిర్‌పోర్టు-ఫ్యూచర్‌ సిటీ మెట్రో రైల్‌ లైన్‌ పూర్తి చేయడానికి రూ.7,168 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మార్గంలో 2029 నాటికి ప్రయాణికుల సంఖ్య 1.98 లక్షలు ఉంటుందని, 2055 నాటికి 6.03 లక్షలకు పెరుగుతుందని అంచనా వేశారు.

కారిడార్​ - 10 :

  • కారిడార్‌ 10లో జేబీఎస్‌ నుంచి మేడ్చల్‌ వరకు 24.5 కిలో మీటర్లు ప్రతిపాదించారు. ఈ మార్గంలో 18 స్టేషన్లు రానున్నాయి.
  • జేబీఎస్‌ న్యూ, డైమండ్‌ పాయింట్, బాపూజీనగర్, ఓల్డ్‌ బోయిన్‌పల్లి, బోయిన్‌పల్లి చెక్‌పోస్టు, డెయిరీ ఫాం, సుచిత్ర జంక్షన్ రానున్నాయి.
  • అలాగే పైప్‌లైన్‌ రోడ్, అంగడిపేట్, దూలపల్లి ఎక్స్‌రోడ్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, ఈఎంఆర్‌ఐ, కండ్లకోయ, ఓఆర్‌ఆర్‌ మేడ్చల్, మేడ్చల్‌ చెక్‌పోస్ట్, మేడ్చల్‌లో ముఖ్యమైన స్టేషన్లు వచ్చే అవకాశముంది.
  • జేబీఎస్​-మేడ్చల్‌ మెట్రో రైల్‌ లైన్‌ పూర్తి చేయడానికి ఖర్చును రూ.6,946 కోట్లుగా అంచనా వేశారు. ఈ మార్గం పూర్తైతే 2030 నాటికి నిత్యం 2.54 లక్షల మంది ప్రయాణిస్తారని, 2055 నాటికి ఈ సంఖ్య 5.70 లక్షలకు చేరే అవకాశముందన్నారు.

కారిడార్​ - 11 :

  • కారిడార్‌ 11లో జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి శామీర్‌పేట వరకు 22 కిలో మీటర్ల మార్గంలో 14 స్టేషన్లు వస్తాయి.
  • జేబీఎస్‌ న్యూ, విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి ఎక్స్‌రోడ్, లాల్‌బజార్, లోతుకుంట, అల్వాల్ మార్గాలు రానున్నాయి.
  • అలాగే రాష్ట్రపతి నిలయం కూడలి, బొల్లారం, హకీంపేట, దేవరయాంజాల్, తూంకుంట, ఓఆర్‌ఆర్‌ శామీర్‌పేట, శామీర్‌పేట ప్రాంతాల్లో స్టేషన్లు వస్తాయి.
  • జేబీఎస్-శామీర్‌పేట మెట్రో రైల్‌ లైన్‌ వ్యయం రూ.5,465 కోట్లుగా అంచనా వేశారు. 2030 నాటికి నిత్యం ఈ మార్గంలో 1.92 లక్షల మంది ప్రయాణిస్తారని, 2055 నాటికి ఆ సంఖ్య 3.74 లక్షలకు పెరుగుతారని డీపీఆర్​లో పేర్కొన్నారు.

హైదరాబాద్​లో మెట్రో సేవలు మరింత చేరువ : మెట్రో 1, 2, 3 కారిడార్లు కలిపి 69.2 కిలో మీటర్లు ఇప్పటికే పూర్తై సేవలందిస్తోంది. ఇప్పటికే మెట్రో 2-Aలో భాగంగా 4, 5, 6, 7, 8 కారిడార్లలో 76.4 కిలో మీటర్ల మెట్రో రైల్‌ లైన్​ను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీని అనుమతి కోసం కేంద్రానికి 2024 నవంబరులోనే పంపించారు. తాజాగా మెట్రో రెండో దశ బి-భాగానికి సంబంధించిన డీపీఆర్​ను కేంద్రానికి పంపేందుకు సర్వం సిద్ధం చేశారు.

మెట్రో విస్తరణకు కేబినెట్​ గ్రీన్​ సిగ్నల్ (ETV Bharat)

హైదరాబాద్​ మెట్రో - మూడు మార్గాలు సుగమమయ్యేనా?

ఛార్జీల పెంపు ఎఫెక్ట్ : మెట్రోకు తగ్గిన డిమాండ్​ - ప్రయాణికులు లేక ఖాళీగా ట్రిప్పులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.