Telangana Bar and Restaurent Owners : హైదరాబాద్ నాంపల్లిలోని ఆబ్కారీ శాఖ కార్యాలయం ముందు తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఆందోళనకు దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన బార్ల యజమానులు తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. బార్ల చుట్టూ వైన్ షాపులలో పర్మిట్ రూమ్‌లు ఉండటంతో కస్టమర్లు తగ్గిపోయి తమ వ్యాపారం దెబ్బతింటుందని అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పర్మిట్ రూమ్లతోనే సమస్య : వైన్ షాపులకు పర్మిట్ రూమ్ ఇవ్వడం వల్ల తమ బార్లలో వ్యాపారం సరిగ్గా నడవడంలేదని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఆరోపించింది. అసోసియేషన్ రాష్ట్ర సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. సంఘం అధ్యక్షుడు జి.దామోదర్ గౌడ్ మాట్లాడుతూ పర్మిట్ రూమ్ నింబంధన 25, 26 ప్రకారం 100 స్వ్కేర్ మీటర్లలో ఉండాలని కానీ ఎవరూ వాటిని పట్టించుకోవడం లేదని వాపోయారు.
తిను బండారాలు కూడా ఉండొద్దని నిబంధనలలో ఉందని తెలిపారు. కానీ వైన్ షాపుల యాజమాన్యాలు రూల్స్ అతిక్రమించి 5 వందల స్క్వేర్ మీటర్ల నుంచి 2 వేల స్క్వేర్ మీటర్ల వరకు పర్మిట్ రూమ్‌లను నడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బార్లు చుట్టూ పక్కల బెల్టు షాపులు చాలా ఉన్నాయని, వాటిని ఎక్సైజ్ శాఖ అధికారులు తొలగించాలన్నారు.
"మూడు సమస్యలపై ప్రధానంగా మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. బెల్ట్ షాపుల వల్ల, వైన్ షాపులు పర్మిట్ రూమ్ నిబంధనలను పట్టించుకోకపోవడం లాంటి వాటితో బార్ ఓనర్లు వ్యాపారం లేక సతమతమవుతున్నాం. ప్రభుత్వానికి రెవెన్యూ విషయంలో బార్లు, వైన్ షాపులు రెండు కళ్లలాంటివి. ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకొని న్యాయం చేయాలి" -జి. దామోదర్ గౌడ్, తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు
తక్షణమే వాటిని తొలగించాలి : వైన్ షాపు ఓనర్లు పర్మిట్ రూముల విషయంలో నిబంధనలకు బేఖాతరు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అలాగే బెల్ట్ షాపుల వల్ల బస్తీలలో ఉండే ప్రజలకు అంతరాయం కలగడంతో పాటు తమ వ్యాపారానికి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. తక్షణమే వాటిని సైతం తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వైన్ షాపు సమయం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉందని, హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ పరిధిలో రాత్రి 11 గంటల వరకూ ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న వైన్ షాపులకు కూడా జిల్లాలో మాదిరి నిబంధనలే పెట్టాలన్నారు.
మంత్రి జోక్యం చేసుకోవాలి : ఈ మూడు సమస్యలపై ప్రధానంగా తాము చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి రెవెన్యూ విషయంలో బార్లు, వైన్ షాపులు రెండు కళ్లలాంటివని దామోదర్ గౌడ్ చెప్పారు. ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.
53 బార్ లైసెన్సులకు నోటిఫికేషన్ - ఆరోజే చివరి తేదీ
బార్లో గడిపిన అదా శర్మ - ఇదంతా ఆ పాత్ర కోసమే! - Adah Sharma Sunflower Series