ETV Bharat / state

2028 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి - అధికారులకు చంద్రబాబు ఆదేశం - EXPERTS MEETING ON POLAVARAM

పోలవరం స్పీడప్​ - బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు నిపుణుల మేధోమథనం - నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలు, అధికారులకు సీఎం సూచన

Experts_Meeting_on_Polavaram
Experts Meeting on Polavaram (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2024, 8:52 PM IST

Updated : Nov 5, 2024, 10:22 PM IST

Technical Experts Meeting on Polavaram: బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు పోలవరం ప్రాజెక్టు సాంకేతిక అంశాలపై నిపుణుల మేధోమథనం నిర్వహించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణం, జియో టెక్నికల్ అంశాల్లో నిపుణులైన విదేశీ బృందం సహా కేంద్ర జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ఏపీ జలవనరుల శాఖ, దిల్లీ, చెన్నై, తిరుపతి ఐఐటీ నిపుణులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.

నవంబరు 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ సహా ప్రాజెక్టు నిర్మాణాలపై సాంకేతిక నిపుణులు చర్చించనున్నారు. ప్రాజెక్టును విదేశీ, స్వదేశీ సాంకేతిక నిపుణులు క్షేత్రస్థాయి నుంచి పరిశీలించనున్నారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం, డిజైన్లపై చర్చించనున్నారు. డయాఫ్రం వాల్​తో పాటు సమాంతరంగా ప్రధాన నిర్మాణం ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పైనా నిపుణులు చర్చించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత తదితర అంశాలపైనా చర్చించనున్నారు.

మరోసారి పోలవరం ప్రధాన డ్యాం అంచనాలు పెంపు - ఎన్ని వేల కోట్లంటే ?

CM Chandrababu Review on Polavaram: 2028 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రణాళిక చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం సమీక్ష నిర్వహించారు. కొత్త డయాఫ్రం వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనుల ప్రారంభం, పూర్తి చేసే సమయంపై చర్చించారు. 1,396 మీటర్ల పొడవైన నూతన డయాఫ్రం వాల్ పనులు జనవరి నుంచి మొదలుపెట్టడానికి సన్నాహాలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పోలవరం ఫలాలు అందేందుకు ప్రతిరోజూ కీలకమేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు 2028 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించి పనులు ప్రారంభిచేందుకు గత నాలుగు నెలలుగా తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. వివిధ దశల్లో రావాల్సిన అనుమతులు, సాంకేతిక, ఆర్థిక సమస్యలు, సవాళ్లపై అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన పనులను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్2 పనుల్లో డీవాటరింగ్ పనుల పురోగతిని వివరించారు.

పోలవరానికి నిధులు విడుదల - వ్యక్తమవుతోన్న హర్షాతిరేకాలు - Polavaram Project Funds

డయాఫ్రం వాల్ పనులు జనవరి నుంచి మొదలు: ఇక్కడ చేపట్టిన డీ వాటరింగ్ పనుల ద్వారా డయాఫ్రం వాల్ పనులు చేపట్టడానికి అనువైన పరిస్థితి ఏర్పడిందని అధికారులు వివరించారు. డయాఫ్రం వాల్ డిజైన్ల అనుమతి కోసం గత నెల 24 తేదీన సీడబ్ల్యూసీకి పంపినట్లు అధికారులు తెలిపారు. కొత్త డయాఫ్రం వాల్ డిజైన్లు, నిర్మాణ ప్రణాళికపై సమీక్షలో ప్రధానంగా చర్చించారు. కొత్త డయాఫ్రం వాల్ పొడవు 1,396 మీటర్ల మేర నిర్మించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. డిజైన్లకు అనుమతులు వస్తే జనవరి నుంచి పనులు ప్రారంభించవచ్చని తెలిపారు. 1,396 మీటర్ల పొడవైన డయాఫ్రం వాల్ 1.5 మీటర్ల వెడల్పుతో నిర్మించాల్సి ఉందని తెలిపారు. కొన్ని చోట్ల 10 మీటర్ల లోతులో, కొన్ని చోట్ల 90 మీటర్ల పైగా లోతులో డయాఫ్రం వాల్ నిర్మాణంచేపట్టాల్సి ఉందని అధికారులు తెలిపారు.

మొత్తంగా 63,356 చదరపు మీటర్ల ప్రాంతంలో డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. డయాఫ్రం వాల్, ఈసీఆర్ఎఫ్ పనులు సమాంతరంగా చేయడానికి సీడబ్లూసీ అనుమతులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. సాంకేతిక అంశాలపై నవంబర్ 9వ తేదీ వరకు పోలవరంలో జరిగే వర్క్ షాప్ అనంతరం స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. సీడబ్ల్యూసీతో చర్చలు జరిపి డయాఫ్రం వాల్ పనులు, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు సమాంతరంగా చేపట్టడానికి ఉన్న అవకాశాలు పరిశీలించాలని సీఎం సూచించారు. జనవరిలో డయాఫ్రం వాల్ పనులు ప్రారంభిస్తే పూర్తి కావడానికి సరిగ్గా ఏడాది పడుతుందని నిర్మాణ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

2028 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేలా: ఆ తరువాత ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు మొదలు పెడితే 24 నెలలు పడుతుందని నిర్మాణ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సమాంతరంగా పనులు చేపడితే 2027 జూలై నాటికి, విడివిడిగా పనులు చేపడితే 2028 మార్చి నాటికి పనులు పూర్తి చేయవచ్చని నిర్మాణ సంస్థ ప్రతినిధిలు తెలిపారు. పనులు త్వరగా పూర్తి చేయడంతో పాటు, నాణ్యత కూడా ముఖ్యమని నిబంధనలకు అనుగుణంగా, ఎక్కడా లోపం లేకుండా పనులు చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. అదే విధంగా ఇప్పటి వరకు 77 శాతం పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి అయ్యాయని, రూ.960 కోట్ల పనులకు టెండర్లు పిలిచామని డిసెంబర్ నుంచి పనులు ప్రారంభించి 2025 జూలై నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

"రూ.2,800 కోట్లు తీసుకోండి" - పోలవరం పనులకు తొలిసారిగా అడ్వాన్స్ ఇచ్చిన కేంద్రం

పోలవరం పనులపై ప్రణాళిక విడుదల అప్పుడే: పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 1 లో భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులకు రూ.7,213 కోట్లు అవసరం అని అధికారులు వివరించారు. ఫేజ్ 1 పూర్తికి ఇంకా 16,440 ఎకరాల భూసేకరణ జరపాల్సి ఉందని అధికారులు తెలిపారు. 2025 ఏప్రిల్ నాటికి భూసేకరణ, 2026 ఏప్రిల్ నాటికి ఆర్ అండ్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు ఈ పనులు కూడా సమాంతరంగా జరగాలని సీఎం అధికారులకు సూచించారు. దీనికి అవసరమైన నిధులు ఎప్పడికప్పుడు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అదే విధంగా పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు తీసుకువెళ్లాలనే అంశంపైనా సమీక్షలో చర్చించారు. కొత్తగా మరో కాలువ నిర్మించడమా లేక ఉన్న కాలువను విస్తరించడమా అనే అంశాన్నీ చర్చిస్తున్నామని అధికారులు తెలిపారు.

అదే విధంగా పోలవరం ప్రాజెక్టుతో పాటు గతంలో ప్రతిపాదించిన పోలవరంపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం కూడా చేపట్టాలని సీఎం సూచించారు. మరోవైపు కాలువ కట్టలను కూడా బలోపేతం చేసుకుని నీటి తరింపునకు సిద్ధం చేయాలని అన్నారు. పవర్ ప్రాజెక్టు పనులు కూడా ముందుగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలని సీఎం నిర్మాణ సంస్థను ఆదేశించారు. పోలవరం పనులు తిరిగి పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు అవసరమైన అన్ని అనుమతులు వెంటనే పొందాలని అన్నారు. ఈ నెలలో పోలవరం సందర్శనకు వచ్చి పనులపై ప్రణాళిక విడుదల చేస్తానని సీఎం అన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు ₹ 2,348 కోట్లు అడ్వాన్స్‌ - 75% ఖర్చు చేస్తేనే తదుపరి నిధులు

అనంతరం చింతపూడి లిఫ్ట్ పనులపైనా సీఎంకు అధికారులు వివరించారు. 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.2,463 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. అనంతరం వెలిగొండ పనులపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. ఇంకా రూ.2,200 కోట్ల విలువైన పనులు పెండింగ్​లో ఉండగానే వెలిగొండ పూర్తి అంటూ జగన్ ప్రారంభించారని మంత్రి రామానాయుడు వివరించారు. వెలిగొండ ప్రాజెక్టు ఫలాలు అందాలంటే ఇంకా రూ.2,211 కోట్ల నిధులు, రెండేళ్ల కాలపరిమితి అవసరం ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని దీనికి అవసరమైన ప్రణాళికతో రావాలని అధికారులకు సూచించారు. గోదావరి పెన్నా లింకేజ్ పనులకు అవసరమైన భూసేకరణ పనులు చేపట్టాలని సీఎం సూచించారు.

పోలవరానికి అడ్వాన్స్​ పద్దు - ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు అడుగులు

Last Updated : Nov 5, 2024, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.